థమన్ తో గురూజీకి చెడిందా?

Trivikram And Thaman: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్ ను పక్కన పెడుతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గురూజీ సినిమాలను తన మ్యూజిక్ తో ఓ రేంజ్ లో లేపాడు థమన్. అలాంటిది ఇప్పుడు ఆయన్నే పక్కన పెట్టేసి తన కొత్త సినిమా కోసం మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నాడట త్రివిక్రమ్. ఇంతకీ ఆ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

తన సినిమాల్లో హీరోయిన్స్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ ని రిపీట్ చేయడం త్రివిక్రమ్ కొన్న అలవాటు గతంలో చూసుకుంటే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సా అత్తారింటికి దారేది జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు ఆ తర్వాత డి.ఎస్.పి ప్లేస్ లో తమన్ వచ్చాడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేత, అల్లు అర్జున్ అలవైకుంఠపురం, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలకు తమన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.

ఈ సినిమాకి కూడా తమని మ్యూజిక్ డైరెక్టర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే.. గురూజీ తమన్ ప్లేస్ లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుపోతున్నారట. గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన గత సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ, ఇప్పుడు తమన్ ప్లేస్‌లో ఆయన కొత్త సంగీత దర్శకుడుతో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసి, ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ సినిమాలోని తమన్ ప్లేస్‌లో హర్షవర్ధన్ రామేశ్వర్ చేత సాంగ్స్ చేయించాలని భావించినట్లుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ ఎన్‌టీఆర్‌తో చేయబోతున్న సినిమా మాత్రం అనిరుద్‌కి ఇచ్చినట్లుగా సమాచారం. మొత్తంగా త్రివిక్రమ్ మాత్రం థమన్ ను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో భేటీ అయినప్పటి నుంచి ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. Trivikram And Thaman.

త్రివిక్రమ్ థమన్ ను పక్కన పెట్టడానికి రిజన్ ఏంటి? వీళిద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? లేక థమన్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుండటంతో డేట్స్ దొరక్క అతని ప్లేస్ లో మరొకరిని తీసుకున్నాడా? అనే విషయం తెలీదు కాని.. ప్రస్తుతం త్రివిక్రమ్ తన కొత్త సినిమాలో చేయబోతున్న ఈ మార్పు గురించి ఇండస్ట్రీలో తెగ డిస్కషన్ నడుస్తోంది. ఇక త్రివిక్రమ్ – వెంకటేష్ సినిమా విషయానికొస్తే.. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్ లతో సాగే కథ, కథానాలతో ఈ సినిమా తెరకెక్కబోతునట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ సరసన కన్నడ యంగ్ హాట్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట.