
Guar gum powder: గోరుచిక్కుడు… చిక్కుడు జాతి కుటుంబానికి చెందిన మొక్క ఇది. దాదాపు అందరికీ తెలిసిన కూరగాయే . ఈ మొక్క తీవ్ర కరువు పరిస్థితులను, అధిక వేడిని తట్టుకొని మనగలుగుతుంది. మార్కెట్ లో కూడా నిలకడైన ధర పలుకుంది. అందుకే చాలా మంది రైతులు దీనిని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ చిక్కుడు కేవలం ఆహారంలో ఉపయోగపడే కూరగాయ మాత్రమే కాదు..భారత దేశానికి మిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మన దేశంలో పండిన చిక్కుడు అమెరికాకు పెద్దఎత్తున ఎగుమతీ అవుతోంది. దీంతో స్థానికంగానే కాదు అంతర్జాతీయంగా మన దేశీ కూరగాయకు భారీ డిమాండ్ ఏర్పడింది.
గోరు చిక్కుడు విత్తనాల నుంచి గ్వార్ గమ్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. పొడి రూపంలో ఉండే గ్వార్గమ్ కు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ గమ్ ను వివిధ రకాల పరిశ్రమల్లో ద్రవాలను చిక్కగా చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా గ్వార్ గమ్ శిలాజ ఇంధనాల వెలికితీత ప్రక్రియలో వినియోగిస్తారు. అంటే భూమి నుండి బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను తీసే క్రమంలో వాడే షెల్ రాక్ లో దీనిని వాడతారు. ఈ ప్రక్రియను హైడ్రాలిక్ ఫ్యాక్చరింగ్ అని అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా గ్వార్ గమ్ ను ఇతర పదార్ధాలతో తయారు చేసిన మిశ్రమాన్ని రాళ్ల మధ్య పగుళ్లలోకి పంపిస్తారు. తద్వారా ఎలాంటి అడ్డంకి లేకుండా చమురు కానీ ఇతర శిలాజ ఇంధనాలు కానీ బయటకు వచ్చేందుకు తోడ్పడతాయి. పెట్రోలియం ఇండస్ట్రీతో పాటు ఫుడ్, మెడిసిన్, పేపర్,టెక్స్ టైల్ ఇండస్ట్రీస్ లో బ్యూటీ ప్రాడక్ట్స్ తయారీలో గోరుచిక్కుడు గమ్ ను ఉపయోగిస్తారు.
గ్వార్ గమ్ భారత్ కు ప్రధాన వనరు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే 90 శాతం గ్వార్గమ్ విదేశాలకు ఎగుమతి అవుతోంది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం 2023 -2024లో భారత్ నుంచి 4 లక్షల 17 వేల 674 మెట్రిక్ టన్నుల గ్వార్గమ్ ఎక్స్ పోర్ట్ అయ్యింది . దాని విలువ సుమారు 541 మిలియన్ డాలర్లుగా ఉంది. గ్వార్గమ్ కు అతి పెద్ద ఎగుమతి దారు భారత్ కాగా, అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. కేవలం అమెరికాకు మాత్రమే కాదు భారత్ నుంచి జర్మనీ, రష్యా , నార్వే, నెదర్ ల్యాండ్స్ కి కూడా గ్వార్గమ్ ఎక్స్ పోర్ట్ అవుతోంది. Guar gum powder.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీస్ పై ఉన్న ఆంక్షలను ఎత్తేసింది. దీని ద్వారా గ్వార్గమ్ డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ భారత్ పై ట్రంప్ సుంకాలు విధించడంతో 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీని ప్రభావం గ్వార్గమ్ మార్కెట్ మీద కూడా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇక భారత్ తో పాటు పెద్ద ఎత్తున పాకిస్థాన్ , అమెరికా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లోనూ గోరుచిక్కుడు సాగవుతోంది. . అయితే గోరుచిక్కుడు ఉత్పత్తిలో 80 శాతం వాటా భారత్ దే అని అపెడా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 72 శాతం గోరుచిక్కడు పంట రాజస్థాన్ నుంచే వస్తోంది. ఇదండి రైతుకు లాభాలు తెచ్చిపెడుతోన్న గోరుచిక్కుడు గమ్ కథ. స్థానకింగా ఈ పంటకు నిత్యం నిలకడైన ఆదాయం వస్తున్నా..ఇలా అంతర్జాతీయంగా పంటను ఎగుమతి చేస్తే రైతుకు మరింత ఆదాయం సమకూరుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్యపరంగా ఆ పంటను చేపడితే రైతు పంట పండినట్లే.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q