
Allagadda constituency Maize Crop: ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు ముందస్తుగానే పలకరించడంతో రాష్ట్రమంతా ఏరువాకను ముందస్తుగానే మొదలుపెట్టారు. ఈ కోణంలో అన్ని జిల్లాలో తమ పంట పొలాల్లో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు ఆయా పంటలను వేసి మంచి దిగుబడిని సాధిస్తున్నారు ఈ పంటల విషయమై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ఎక్కువ శాతం మంది రైతులు మొక్కజొన్నను ఎన్నుకున్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని మొక్కజొన్న సాగు చేస్తున్న ఒక రైతు పంటపై కథనం…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఆళ్లగడ్డ ప్రాంతపు రైతులు కేవలం వ్యవసాయ ఆధారిత జీవనాన్ని ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు. ఈ ప్రాంతపు రైతులు రైతులు ఎక్కువ శాతం కంది మిరప వరి పండించే వాళ్ళు.. కానీ ఇప్పుడు ఇటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటకు ఎక్కువ శాతం మిగులుదల లేకపోవడంతో ఎక్కువ శాతం ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ఈసారి మొక్కజొన్న పంటను ఎంచుకున్నారు.. ఈసారి సుమారు 20వేల ఎకరాల మొక్కజొన్నని పండించేందుకు సిద్ధమై పంటను వేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు పంట వేసినప్పటికీ ఈ మొక్కజొన్న పంటను వేసిన మొదటి నెల నుంచి పంట వచ్చే ఆరు నెలల కాల వ్యవధిలో అనేక వ్యయ ప్రయాసలను భరించి మొక్కజొన్న పంటను పండిస్తున్నారు.
20వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నప్పటికీ మొక్కజొన్న పంట మాత్రం కేవలం బోర్ల కిందనే పండాలి వ్యవసాయానికి కావాల్సిన సమయంలో నీరు అందకపోవడం కాలువలు చెరువులు సరిగా లేకపోవడం ఒకవేళ చెరువులు ఉన్న సకాలంలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు బోర్లను ఆశ్రయించినప్పటికీ పంట వేసిన తర్వాత బోర్లలో నీళ్లు లేకపోతే చానా ఇబ్బందులకు గురి అయ్యే వాళ్ళు కానీ ఈ సారీ వరుణ దేవుడు ముందస్తుగానే వచ్చి రుద్దుపవనాలను పలకరించడంతో అధిక వర్షపాతం నమోదు కావడంతో బోర్లలో పుష్కలంగా నీళ్లు రావడంతో మొక్కజొన్న పంట ఎక్కువ శాతం పండిస్తున్నారు. పంట దిగుబడి రావడానికి వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలను పాటిస్తూ ఆళ్లగడ్డ రైతాంగం మొక్కజొన్న సాగును విజయవంతంగా పంటను పండించి లాభాల బాటన పడుతున్నారు. ప్రధానంగా మొక్కజొన్న పంటకు సరైన నీరు ఎరువులు యూరియాలను ఉపయోగించి పంట దిగుబడి ఎకరానికి 40 కింటాలు పండించేందుకు వీలుంటుంది.
ఈ మొక్కజొన్న పంటకు క్వింటాకు 2500 రూపాయల ఆదాయం రాగా 40 క్వింటాలకు ఒక ఎకరాకు లక్ష రూపాయలు వస్తే 50వేల రూపాయలు మందులు కూలీలు ట్రాక్టర్ తో దున్నిచ్చిన కూలీలు అన్ని కలిపితే 50 వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు రైతులు తెలిపారు. ఈసారి అయితే ముందస్తుగా వచ్చిన వర్షాల వలన రైతులు బోరు నుంచి నీళ్లను ఆశ్రయించేది మాత్రం తక్కువే అని చెప్పాలి పంట తొలినాడు నుండి ఆఖరి రోజు వరకు కూడా దఫ దఫాలుగా వర్షాలు రావడము రుతుపవనాలు యాక్టివ్ గా ఉండడంతో మొక్కజొన్న పంటకు సకాలంలో మాత్రం నీరు అందిన పరిస్థితి ఆళ్లగడ్డ నియోజకవర్గం లో నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో వ్యవసాయ అధికారి ఏ డి రామ్మోహన్ రెడ్డి పంటలు వేసే రైతులకు అవసరమైన సూచనలు సలహాలను ఏ సమయంలో మందులు వేయాలి ఏ విత్తనం వేయాలి ఎలా దిగుబడి చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయాలు క్షుణ్ణంగా రైతులకు వివరిస్తున్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ తనవంతుగా జిల్లాలో ఎక్కడ కూడా యూరియాలకు లోటు లేకుండా తగిన విధంగా స్టాకులను సప్లై చేయడం ద్వారా వ్యవసాయ అధికారులను కూడా అపరిమతం చేయడంతో రైతులకు సకాలంలో ఎరువులను మందులను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతన్న ఈసారి ఎక్కువగా ప్రోత్సహించడంతో ఆళ్లగడ్డ రైతాంగం మంచి దిగుబడిని సాధిస్తుంది మొక్కజొన్న రైతు సగిలి రామిరెడ్డి వివరణకు ప్రస్తుతం మొక్కజొన్న పంట ఆశాజనకంగా ఉందని ఎక్కువ శాతం మంది మొక్కజొన్నను ఆశ్రయించామని ఈసారి మంచి లాభాలను పొందుతామని తెలిపారు. Allagadda constituency Maize Crop.
ఈ సీజన్లో మొక్కజొన్న పంట విస్తరంగా పండించడం వలన వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు బ్రోకర్లు కూడా ఇప్పటికే మంచి రేటును ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. మంచి హోల్సేల్ ధరలతో పెద్ద పెద్ద మార్కెట్లనుంచి పంట వద్దకు వచ్చి గిట్టుబాటు ధరను ఇచ్చి విజయవాడ హైదరాబాదు వివిధ ప్రాంతాలకు కూడా ఈ పంటను తీసుకొని వెళుతున్నరైతు ప్రభుత్వం మరింత గిట్టుబాటు ధరను కల్పించి రాయితీలను ఇస్తే మా రైతు జీవితాలు బాగుపడతాయని రైతుల కోరుతున్నారు.