తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్లు..!

Nara Chandrababu Naidu: 75 ఏళ్ల నవ యువకుడు…. 47 ఏళ్లుగా ప్రజా సేవలో తరిస్తోన్న ధన్యుడు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కంకణబద్దుడు ఆయనే నారా చంద్రబాబు నాయుడు.తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మైలురాయిని చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 30 ఏళ్లు అవుతోంది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం. ఆయన రాజకీయ నైపుణ్య చాతుర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రబాబు తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టి సోమవారానికి సరిగ్గా 30 ఏళ్లవుతుంది. పార్టీనే ప్రాణంగా నమ్ముకుని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే.. పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకీ పీఠం దక్కింది. సానుకూల దృక్పథం ఉన్నవారెవరూ విఫలమైనట్లు చరిత్రలో లేదు. చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణాల్లో సానుకూల దృక్పథం ఒకటి. అదే ఆయనకు 1999 ఎన్నికల్లో విజయం చేకూర్చి పెట్టింది.

సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాలలో సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం గల నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధితుల స్వీకరించి రికార్డు క్రియేట్ చేశారు. ఆయన ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు.

చంద్రబాబు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. చంద్రబాబు తండ్రి నారా ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు తల్లి అమ్మ‌ణ్ణ‌మ్మ‌ గృహిణి. చంద్రబాబు స్వంత ఊరిలో పాఠశాల లేకపోవడంతో ఆయన ఐదవ తరగతి వరకు శేషాపురంలోని ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి 1972లో BA డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరువాత.. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. 1974లో ప్రొఫెసర్ డాక్టర్. DL నారాయణ మార్గదర్శకత్వంలో తన Ph.D.ని ప్రొఫెసర్ NG రంగా ఆర్థిక ఆలోచనలు అనే అంశంపై చేయాలని భావించారు. కానీ, రాజకీయాలపై ద్రుష్టిపెట్టడంతో అతని Ph.D పూర్తి చేయలేదు.

విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. ఇక చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గ నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆనాటి సీఎం అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.1980- 1983 వరకు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తారు. అదే సమయంలో 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు.

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ని స్థాపించి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది టీపీడీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మమా నందమూరి రామారావు పిలుపు మేరకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. ప్రారంభంలో చంద్రబాబు నాయుడు పార్టీ పనులు, శిక్షణా శిబిరాలను నిర్వహించడం, సభ్యత్వ రికార్డులను కంప్యూటరీకరించడంలో నిమగ్నమయ్యాడు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణంగా ప్రభుత్వంలో 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో అతను క్రియాశీల పాత్ర పోషించాడు . ఎన్టీఆర్ 1986లో నాయుడుని TDP ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఓటములను, అవమానాలను ఎదుర్కొంటూ అధికార మంత్రదండాన్ని అందుకోవడం ఆషామాషీ కాదు. అన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్నవాడే అసలైన విజేత. అలా లక్ష్య ఛేదన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. 1 సెప్టెంబర్ 1995 న చంద్రబాబు నాయుడు..ఎన్టీ రామారావు నాయకత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైన తిరుగుబాటు తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి వివాదాస్పద పాత్ర కారణంగా అంతర్గత తిరుగుబాటు చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు మెజారిటీ శాసనసభ్యుల మద్దతును పొందగలిగారు. దీంతో ఎన్టీఆర్ ను గద్దే దించి.. చంద్రబాబు అధికారం చేపట్టాడు. ఇక ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబుకి దక్కింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ‘ప్రజల వద్దకే పాలన’, ‘జన్మభూమి’, ‘శ్రమదానం’ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశారు. ప్రత్యేకించి, సాంకేతికతపై ఆయనకున్న ముందుచూపుతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేశారు. ఇది ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టింది. ఆయన హయాంలోనే ఏర్పాటైన డ్వాక్రా సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాయని విశ్లేషకులు పేర్కొంటారు. Nara Chandrababu Naidu.

రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో, ఇద్దరు ప్రధానుల ఎంపికలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు ముఖ్య భూమిక వహించారు.

1999 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తన పార్టీని విజయపథంలో నడిపించారు. రాష్ట్ర అసెంబ్లీలోని 294 సీట్లలో 180 స్థానాలు సాధించారు.అదనంగా పార్లమెంటు ఎన్నికలలో 42 స్థానాలకు గాను 29 స్థానాలను TDP గెలుచుకుంది. దీంతో BJP మిత్రపక్షాలలో అతిపెద్ద పార్టీగా, లోక్‌సభలో నాల్గవ అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, బలమైన ఎన్నికల ఆదేశాన్ని పొందిన మొదటి ఆర్థిక సంస్కర్తగా మీడియా ఆయనను కీర్తించింది.

ఇక 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు పేల్చి చంద్రబాబు నాయుడు పై హత్య ప్రయత్నం చేశారు. కానీ, అదృష్టవ సర్దు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రెండుసార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాత 2004లో జరిగిన మద్యంత్ర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల్లో రెండింటిలోనూ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ 185 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ 47 సీట్లును కైవసం చేసుకుంది. ఆ పార్టీ ఎన్నికల చరిత్రలోనే అత్యల్పంగా నిలిచింది. అటు పార్లమెంట్‌లో 42 స్థానాలకు గానూ టీడీపీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం, 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఢిల్లీలో కాంగ్రెసేతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో (1996-2004)చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం గమనార్హం. 1996 పార్లమెంటరీ ఎన్నికల తరువాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్ పాత్రను స్వీకరించారు. 13 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి (1996 -1998) హెచ్‌డి దేవెగౌడ, తరువాత ఐకె గుజ్రాల్ ను ప్రధాన మంత్రులు చేయడంలో ఆయన కీలక పాత్ర నాయకత్వం వహించారు. ఆ రెండుసార్లు చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ, చంద్రబాబు దాన్ని సున్నితంగా నిరాకరించారు.

పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్‌-2020కి రూపకల్పన చేశారు. జలసంరక్షణ కోసం నీరు-మీరు ప్రారంభించారు. చెట్ల పెంపకాన్ని పెంచేందుకు పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయడం, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు సుపరిపాలన తీసుకురావడం కీలకం. చంద్రబాబు విజన్‌కు నిదర్శనం హైటెక్‌ సిటీ. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే హైటెక్‌ సిటీ నిర్మాణానికి బీజం పడింది. కొండలు, గుట్టలతో నిండి ఉన్న ప్రాంతంలో కేవలం 14 నెలల్లో దాని నిర్మాణం పూర్తి చేసి.. 1998 నవంబరు 22న నాటి ప్రధాని వాజపేయితో ప్రారంభింపజేశారు. బిల్‌ గేట్స్‌ను ఒప్పించి మెప్పించి మైక్రోసా్‌ఫ్టను భాగ్యనగరానికి తీసుకొచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఆయన, ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఆయన, ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఆయన ఇప్పటికి 5,442 రోజుల పాటు సీఎంగా పనిచేసి నేడు 5,443వ రోజుకు అడుగుపెట్టారు.