నెల్లూరు లో బాబాయ్ vs అబ్బాయి..!

Anil kumar yadav vs roop kumar yadav: వాళ్ళిద్దరూ బాబాయ్, అబ్బాయిలు. నెల్లూరులో తిరుగులేని శక్తిగా వాళ్ళిద్దరూ ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో అబ్బాయి అద్భుత విజయం సాధించడంలో వంద శాతం కృషి చేసిన బాబాయ్, ఇప్పుడు అంటీ ముట్టనట్లుగా ఉన్నారట. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చిందట. నెల్లూరులో అబ్బాయి కనిపిస్తే చాలు, మీడియా ముందు రెచ్చిపోతున్నాడట బాబాయ్. బాబాయ్ ఏ రేంజిలో తిట్టినా అబ్బాయి మాత్రం నోరు మెదపడం లేదట. ఇంతకీ ఆ బాబాయ్ అబ్బాయిలు ఎవరు. వాచ్ దిస్ స్టోరీ.

రాష్ట్రంలో రెడ్డీస్ హవా కొనసాగే నెల్లూరు జిల్లాలో బీసీ నాయకుడు అనీల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవిచ్చి సంచలనాలకు తెర తీశారు వైసీసీ అధినేత జగన్. 2014, 2019 ఎన్నికల్లో అనీల్ విజయం కోసం అహర్నిశలు పాటుపడ్డారు ఆయన సొంత బాబాయ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఏ వార్డులో ఎవరిని పట్టుకుంటే ఓట్లు రాలుతాయో, ఎవరిని బుజ్జగిస్తే తమ దారికి వస్తారన్న విషయంలో చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి రూప్ కుమార్ యాదవ్. అందుకే అనీల్ వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించగలిగారు.

ఇంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు కథ మొదలైందట. అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి పోయిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైందట. ఇప్పుడు నువ్వెంత అంటే నీవెంత అనేదాకా పరిస్తితి వెళ్లిందట. అనిల్ యాదవ్ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఎవరినైనా నిందిస్తే చాలు, మరో నిమిషంలోనే రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ను మాటలతో చీల్చి చెండాడుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కానీ, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిని కానీ, మంత్రి నారాయణ కానీ చిన్నమాట అంటే చాలు ఫైర్ అవుతున్నారు రూప్ యాదవ్.

అంతేకాదు, ఓ మీడియా సమావేశంలో అనీల్ యాదవ్ ను పుష్ప సినిమాలో మంగళం శీనుతో పోల్చారు రూప్ యాదవ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించే స్థాయి అనీల్ కుమార్ యాదవ్ కు లేదన్న రూప్ యాదవ్, ఎంఎల్ఏగా పోటీ చేసిన సమయంలో వేమిరెడ్డి ఇంటి ముందు డబ్బులు అడుక్కున్న సంగతి గుర్తు చేసుకోవాలంటూ ఫైర్ అయ్యారు. అనిల్ వంటి నమ్మకద్రోహి రాష్ట్రంలో ఎవరూ లేరని అందుకే నెల్లూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు రూప్ యాదవ్. Anil kumar yadav vs roop kumar yadav.

ఓవైపు రూప్ యాదవ్ ఈ రేంజిలో ఆరోపణలు చేస్తుంటే, అనీల్ మాత్రం నోరు మెదపడం లేదట. జిల్లాలో ఫైర్ బ్రాండ్ నేతగా చెప్పుకునే అనీల్ యాదవ్, ఎందుకు సొంత బాబాయ్ మీద సైలెంట్ అవుతున్నారో అర్థం కావడం లేదని జనం చెబుతున్న మాట. రూప్ యాదవ్ ఆరోపిస్తున్నట్లు కోట్ల రూపాయలు సంపాదించిన అనీల్ యాదవ్, మద్రాసులో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్న ఆరోపణలో నిజం ఉండొచ్చన్న వాదన కూడా ఇప్పుడు జిల్లాలో వినిపిస్తోంది. మరోవిషయం ఏంటంటే, అనిల్ కుమార్ యాదవ్ ఓవరాక్షన్ వల్లే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయిందన్న ఆరోపణ బలంగా వినిపిస్తోందట. జిల్లాలో ప్రముఖ రెడ్డి గార్లను అనిల్ కుమార్ యాదవ్ లెక్కచేయకపోవడం, బండ బూతులు తిట్టటం వల్లే వైసీపీ గ్రాఫ్ మట్టసానికి పడిపోయిందన్న ప్రచారం జరుగుతోందట.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/even-low-level-priests-in-annavaram-are-allegedly-harassing-the-temple-veerla-subba-rao/