వస్తున్నా అరెస్ట్ చేసుకోండి..!

YCP MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విచారణకు విజయవాడ సిట్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణం కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టినదే అని అయన ఆరోపించారు. ఈ కేసు నిలబడదని చెప్పారు. ప్రస్తుతానికి అరెస్టు చేసి ఆనందం పొందవచ్చని… తప్పుడు కేసును ఎదుర్కొని నిలబడే ధైర్యం తనకు ఉందని తెలిపారు.

ఎంపీ విచారణ సందర్భంగా సిట్‌ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. YCP MP Mithun Reddy.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/red-sandalwood-that-is-being-smuggled-in-the-seshachalam-forests-or-else-hunting-of-rare-animals-going-on/