
Dr. B.R. Ambedkar Militarypet: రాత్రి పగలు తేడాలేకుండా, ప్రతికూల వతావరణాన్ని సైతం లెక్క చెయ్యకుండా, సరిహద్దుల్లో డేగకళ్ళతో పహారా కాసే మిలిటరీ జవాన్లు ఆంటే అందరికీ ఎంతో గౌరవం, మరి అలాంటి జవాన్లు ఒక ఊరిలో ఇంటోకొకరు ఉంటే ఆ గ్రామానికి దక్కేగౌరవం మామూలుగా ఉండదు… ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే పేరులోనే మీలటరీ ఉన్న మిలటరీ పేటకు వెళ్ళాల్సిందే…
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఉన్న ఊళ్ల ప్రత్యేకతే దేశభక్తి. దేశాన్ని కాపాడాలనే ధ్యేయంతో ఊరి జనాలు సైన్యం బాట పడతారు. సైన్యంలో చేరడమంటే ప్రాణాలతో చెలగాటమని తెలిసినా.. లెక్కచేయరు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమవుతున్నా.. యుద్ధరంగంలో వీరుడిగా పోరాడటమే లక్ష్యంగా ముందుకెళ్తారు. దేశాన్ని రక్షించే బాధ్యత అందరిదీ.. కాబట్టి ఇంటి నుంచి ఒకరైనా సైన్యంలో చేరాలనే ఆశయంతో ఒక ఊరిలోనే ఎన్నో కుటుంబాలు ఆర్మీలో చేరాయి. దేశ భద్రతలో ప్రత్యేక స్థానం ఏర్పారుచుకున్న మిలటరీపేట వాసులు, మిలటరీ వారి ప్రేరణతో మిలటరీ పేటగా మారిన గ్రామం అది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందిపప్పు పంచాయతీ పరిధిలోని మిలటరీపేట ప్రత్యేకతను సంతరించుకుంది. పూర్వం మిలటరీ వారికి ఈ ప్రాంతంలో ప్రభుత్వం భూములు ఇచ్చింది. వారు ఎక్కడ నివాసాలు ఏర్పరచుకుని ప్రభుత్వం ఇచ్చిన భూములను సంరక్షించుకునేవారు. వీరి ప్రేరణతో ఈ ప్రాంతంలో పలువురు దేశ సేవలో భాగమైన మిలటరీ లో రాణించారు. గతంలో కుటుంబానికి ఒక్కొక్కరు చొప్పున మిలటరీ లో ఉద్యోగాలు సంపాదించారు. వీరిలో కొందరు రిటైర్మెంట్ తర్వాత స్థానిక ప్రభుత్వ రంగ సంస్థల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు మరణించారు. ప్రస్తుతం యువత మిలటరీ వైపు ఎంతో ఆసక్తి చూపడం ఆనందదాయకం అన్నారు.
కాశి రాంబాబు మిలటరీలో పని చేశారు. ఈయన అల్లుడు కూడా మిలిటరీలో పని చేస్తున్నారు. కొడుకు మిలిటరీలో పనిచేస్తున్నారు. తాను రిటైర్మెంట్ తర్వాత కొంతకాలం లైట్ హౌస్ లో సెక్యూరిటీ విభాగంలో పనిచేశానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని అంటున్నారు. జనిపెల్లి సోమన్న 1971 సమయంలో మిలటరీలో చేశారు. ఆ సమయంలో యుద్ధం కూడా జరిగిందని, 1975 లో సోమన్నతో తనకు వివాహం జరిగిందని ఆయన భార్య తెలిపారు. తనకు ఒక్కడే కొడుకుని అయినప్పటికీ అతనిని కూడా మిలటరీ సేవలకే పంపామని, తనకు ఎంతో గర్వంగా ఉందని తల్లి చెప్పారు. తన భర్త,కొడుకుదేశ సేవకు అంకితం అవడంతో తనకు గర్వకారణంగా ఉందని ఆమె వివరించారు. తమ గ్రామంలో ప్రతి ఇంట్లోఒక జవాను ఉన్నాడని, అది తమ ఊరుకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని అంటున్నారు.
ఈ ప్రాంతంలో ప్రస్తుత యువత మిలటరీ వైపు మొగ్గుచూపుడం లేదు. వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. మిలటరీ నుండి ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రభుత్వం సత్వర సహాయం అందించినట్లయితే ఈ దేశరక్షణ పట్ల మరింత ఆకర్షితులు అవుతారని ఈ ప్రాంతంలో కొంతమంది అంటున్నారు.
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సో ఈ సమయంలో దేశ సైనికులకు అండగా నిలవాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరుడి పైన ఉంది. సైనికులను గౌరవించడం అనేది మన కనీస బాధ్యత. వారు తుపాకీ పట్టుకొని సరిహద్దుల వద్ద నిలబడితేనే మనం ఇక్కడ ఊపిరిపించుకోగలుగుతున్నాం. లేకపోతే విదేశీ శక్తులు మన దేశంలోకి చొరబడి ఈ దేశాన్ని దోచుకొని చిన్నాభిన్నం చేసేవి. Dr. B.R. Ambedkar Militarypet.
ఉగ్రవాదులు స్వైర విహారం చేసేవారు. అందుకే మన సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులను జై జవాన్ అని గౌరవించాల్సిందే. మన చుట్టుపక్కల ఒక సైనికుడు కనిపిస్తేనే ఎంతో గౌరవిస్తాము. అలాంటిది ఒక గ్రామంలో ఆ ఊరిలో ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. సైన్యంలో చేరడం అనేది కేవలం ఒక ఉపాధి మాత్రమే కాదు ఎంతో త్యాగనిరతి ఉంటేనే సైన్యంలో చేరాలని తపన ఉంటుంది. సో సైనికులకు ఇదే మా సెల్యూట్.