ప్రజలు మెచ్చుతున్న ఎమ్మెల్యే….!!

Kovur Constituency Vemireddy Prashanthi Reddy: సమస్య ఏదైనా పరిష్కారం దొరుకుతుంది .. అని ఆ నియోజకవర్గ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారా .. దీనికి తగ్గట్టుగానే ఆ ఎమ్మెల్యే నేనున్నాను మీకు తోడుగా అంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా ..? ప్రజలలో ఆ ఎమ్మెల్యే గ్రాఫ్ పెరుగుతుందా ..? ఆ ఎమ్మెల్యే తీరు పట్ల ముఖ్యమంత్రి చాలా సంతోషంగా ఉన్నాడా ? త్వరలో ప్రకటించబోయే మంత్రవర్గ విస్తరణలో ఆ ఎమ్మెల్యేకి చోటు దక్కుతుందా ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం ఎవరా ఎమ్మెల్యే ..? వాచ్ ఆన్ మెగా 9 స్పెషల్ స్టోరీ ..

సింహపురిగా పిలవబడే నెల్లూరు జిల్లా అంటే రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ జిల్లాలో రెండో కోనసీమగా పిలిచే సస్యశ్యామల డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంది ప్రత్యేక స్థానం. ఈ నియోజకవర్గ నుంచి ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించి ఉన్నత స్థానాలకు చేరారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరి, ఆక్వారంగాలపై ఆధారపడిన వారి తోపాటు చైతన్యం కలిగిన ప్రజలు అధికంగా ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో రాజకీయంలో రాణించాలంటే కత్తి మీద స్వాము లాంటిది. ముఖ్యంగా అప్పటి నుంచి ఇక్కడ టిడిపి కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనేది, వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో అది కాస్త వైయస్సార్సీపి, టిడిపి గా మారింది.

అయితే గత ఎన్నికల్లో కోవూరు రాజకీయం యూటర్న్ తీసుకుంది. అప్పటివరకు టిడిపి అభ్యర్థిగా చలామణి అవుతున్న పొలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని పోటీ బరిలో దింపారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో కోవూరులో రాజకీయం ఒక్కసారిగా ఊపొ అందుకుంది. తొలిసారి కోవూరు నియోజకవర్గానికి ఓ మహిళ అభ్యర్థి ఎమ్మెల్యే బరిలో నిలవడం, స్వతహాగా నెల్లూరు జిల్లాలో సేవాభావం కలిగిన కుటుంబ నేపథ్యం ఉన్న వేమిరెడ్డి సతీమణి అవడంతో కలిసి వచ్చి నల్లపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి పై భారీ మెజారిటీతో ప్రశాంతి రెడ్డి విజయ బావుటా ఎగరవేశారు.

ఎన్నికల సమయంలో గ్రామాలలో పర్యటించిన ఆమె ప్రజల సమస్యలను కష్టాలను అవపోసన పట్టారు. అవినీతిరహిత వివాదరహిత కోవూరు ఏ లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా గ్రావెల్, ఇసుక, కోళ్ల వ్యర్ధాల మాఫియా, వంటి వాటిపై తనదైన శైలిలో కట్టడి చేశారు. వీటితో పాటు గ్రామాలలో సమస్యలు ఏదైనా తమ దృష్టికి వస్తే తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు.

మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ సొంత నిధులతో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో త్వరలో క్యాబినెట్ విస్తరణ జరుగుతుండడంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కూడా క్యాబినెట్లో అవకాశం వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఒక ఒక్క కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రజలకు ఎవరికీ ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే వేమిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది అని ప్రతినోట వినిపిస్తుంది.

ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా.. వ్యక్తిగతంగా విమర్శలు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా అభివృద్ధి తన ధ్యేయం అంటూ వీరవనిత గా నియోజకవర్గంలో రాకెట్ లాగా దూసుకుపోతుందని ప్రతి నోటా వినిపిస్తుంది. Kovur Constituency Vemireddy Prashanthi Reddy.

అటు ప్రభుత్వ పథకాలు అభివృద్ధితోపాటు, వీపిఆర్ ఫౌండేషన్ ద్వారా తమ సొంత నిధులను వెచ్చించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా విపిఆర్ జాబ్ మేళా, వీ పి ఆర్ విద్య, వీపిఆర్ వైద్యం , వి పి ఆర్ అమృత ధార, వంటి పథకాలతో పాటు వికలాంగులకు ట్రై సైకిల్ లు పంపిణీ, వంటి సేవా కార్యక్రమాలతో పాటు, రైతులకు పంట కాలువలపూడికతీత, గ్రామాలలో దేవాలయాలు, మసీదులు , ప్రార్థన మందిరాలు వంటి నిర్మాణాలకు దారాళంగా విరాళాలను అందిస్తూ దైవ సంకల్పాలకు సైతం చేయూతను ఇస్తున్నారు.

అటు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారితో సమీక్షా సమావేశాలు నిర్వహించడం తో పాటు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ వద్దకు రావాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. దీంతో ఓ మహిళ ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై సమస్యలను వేగంగా పరిష్కరించుతూ అభివృద్ధి పదంలో నడుపుతుండడంతో ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే గ్రాఫ్ అమాంతం పెరిగిందని చర్చి నడుస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకు మరో 30 ఏళ్లు వరకు తిరుగు ఉండదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/arundhanti-kota-special-story-120-years-history-for-banaganapalli-fort/