
Kurnool District Alur Constituency: నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టి నా కలిసి పనిచేసే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదట. నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలను తొలగించేందుకు అధినాయకత్వం ఆ నియో జకవర్గ పరిశీలకుడ్ని రంగం లోకి తిప్పిందట. ఇంకేముంది పరిస్థితి సర్దుమనిగి అంతా ఒక తాటిపైకి వస్తారు అనుకున్నా ఆ పరిశీలకుడికి కూడా అక్కడి నేతలు చుక్కలు చూపించా రట.. స్వపక్షంలోనే విపక్షంలా మారి గొడవ పడుతున్న ఆ నేతలు ఎవరు.. ఆ నియోజక వర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే..
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇది.. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపుల మధ్య వార్ ప్రస్తుతం తారస్థాయికి చేరు కుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నియోజ కవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ పోటీ చేసి ఓడిపో యారు. ఓడిపోయి నప్పటి నుంచి నియో జకవ ర్గంలో తానే ఇంచార్జిఅంటూ కొనసా గుతు న్నారట. అయితే ఇక్కడ ఇన్చార్జిగా ఎవరిని అఫీషి యల్ గా నియమించ కపోవడంతో ఆ పోస్ట్ కోసం మరో వర్గం కన్నేసిన ట్లు తెలుస్తోంది. మొదటి నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్ ఇంచార్జిగా కొనసాగుతూ ఉన్నా రు. ఈ నేపద్యంలోనే ఎమ్మెల్యే టికెట్ కూడా పార్టీ అధిష్టానం ఆయన కేటాయించింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకుడే నియోజకవర్గ ఇన్చార్జిగా తెలుగుదే శం పార్టీలో కొనసా గుతూ వస్తున్నా రు. అయితే అఫీషియల్ గా పార్టీ అధిష్టా నం ఎవరిని నియమించలేదు కాబట్టి వీరభద్ర గౌడ్ ను దింపి మాకు అవకాశం ఇవ్వాలని వైకుంఠం జ్యోతి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైకుంఠం జ్యోతికి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సపోర్ట్ తో పాటుగా పరిశీ లకు డు పూల నాగరాజు సపోర్టు కూడా ఉన్నట్లు పొలిటికల్ సర్క్యూట్లో చర్చ కొనసాగు తోంది.
మొదటినుంచి నియోజ కవర్గంలో రెండు వర్గాలు టిడిపిలోనే ఉన్న కలిసిన సందర్భా లు ఎప్పుడూ లేవు. రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు టిడిపి అధిష్టానం ఆర్టీసీ చైర్మన్ ఆలూరు నియోజకవర్గం పరిశీలకుడైన పూల నాగరాజు ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అయితే పరిశీల కుడి సమక్షంలోనే రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహి స్తున్న అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీలో వైకుంఠ జ్యోతి వర్గం వారు టాక్టర్ ఏర్పాటు చేశారు. అయితే ఇదే ట్రాక్టర్లోకి రావాలని వీరభద్ర గౌడ్ ను పరిశీలకుడు పూల నాగరాజు ఆహ్వానించారు. అయితే వీరభద్ర గౌడ్ ఆ ట్రాక్టర్ ఎక్కేందుకు వెళుతు న్న క్రమంలో వైకుంఠం జ్యోతి కి సంబంధించిన జెండాలను తొలగిం చాలని వీరభద్ర గౌడ్ అనుచరులు డిమాండ్ చేశారు. రెండు వర్గాలకు చెందిన జెండాలను ట్రాక్టర్ పై పెడి తేనే ట్రాక్టర్ ఎక్కుతా నంటూ ట్రాక్టర్ దిగి వెళ్లిపో యాడట. ఎమ్మెల్సీ బీటీ నాయుడు వీరభద్ర గౌడ్ ను బుజ్జ గించే ప్రయత్నం చేసిన గౌడు మాత్రం వినకుండా తన సొంత డాక్టర్ ను నడుపుకుం టూ ర్యాలీగా బయలు దేరాడు. వైకుంఠం జ్యోతి ట్రాక్టర్ దిగి మా ట్రాక్టర్ ఎక్కాలని పరిశీల కుడిని గౌడ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే అతను అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడక వైకుంఠం జ్యోతి టాక్టర్ లోనే అంబేద్కర్ సర్కిల్ కు చేరుకు న్నారు. ఇద్దరు నేతలను కలపా లని వచ్చిన పరిశీలకుడికి తల పట్టుకున్న ట్లు తెలుస్తోంది.
వీరభద్ర గౌడ్ తన సొంత ట్రాక్టర్ నడుపుకుంటూ ర్యాలీగా అనుచరులతో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి బయలుదేరారు. అయితే రెండు గ్రూపుల మధ్య ఇప్పటికే గొడవ మొదలైన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకు న్నట్లు సమాచారం అందు తుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ ని సాధారణంగా నిలిపివేస్తారు. కానీ గౌడ్ వర్గం వస్తున్నదారికి ట్రాఫిక్ నియం త్రించకుండా పోలీసులు వదిలేసినట్లు సమాచారం అందుతుంది. దీంతో వైకుంఠం జ్యోతి తో పాటు పరిశీలకుడు నాగరాజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమాన్ని ముగిం చారని తెలుస్తోంది. వీరభద్ర గౌడ్ ట్రాఫిక్ దాటుకొని ఆ ప్రాంతానికి వెళ్లేసరికి చాలా లేట్ అయింది. దీంతో తన అనుచరగనంతో వీరభద్ర గౌడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభలో గౌడ్ అనుచరులు పలు కీలక వ్యాఖ్యలు చేసిన ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మా నాయకులు ఇన్చార్జిగా కొనసాగుతూ ఉన్నారని ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ సమాచారం మా నాయకుడికి వస్తుందని ఇన్చార్జి కాదని అధిష్టానం చెప్పలేదని అది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరి oచినట్లు తెలుస్తోంది. మా నాయకుడు ఇన్చార్జి కాదని పార్టీ అధిష్టానం నుంచి చెప్పించాలని నిజంగా ఇంచార్జి కాదు అని చెపితే పార్టీ కార్యకర్తగా కొనసాగడానికి మా నాయకుడికి ఎలాంటి ఇబ్బంది లేదని అంబేద్కర్ సర్కిల్ కార్యకర్తలు ఘాటుగా విమర్శ లు చేసినట్లు తెలుస్తోంది. Kurnool District Alur Constituency.
మొదటి నుంచి ఆలూరు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెంది న వారే ఇన్చార్జిలుగా కొనసా గుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఇన్చార్జి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆలూరులో నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్ కు నాలుగు మండలాల్లో పట్టు ఉన్నట్లు సమాచారం అందుతుంది.. మిగిలిన రెండు మండలాల్లో కూడా క్యాడర్ ఇతడి వెంటే ఉన్నట్లు తెలు స్తోంది. బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టి పార్టీ అధిష్టా నం కూడా ఈ సామాజిక వర్గానికి ఇన్చార్జి పదవి కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ టికెట్ ఇస్తుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగు తున్న ఏ పదవి రావడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు వసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి బీసీ సమాజ్క వర్గానికి కాకుం డా కమ్మ సామాజిక వర్గానికి ఇంచార్జ్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచా రం అందుతోంది.జిల్లా అధ్యక్షు డు తిక్కారెడ్డి తో పాటు నియో జకవర్గ పరిశీల ఎప్పుడు పూల నాగరాజు కూడా కమ్మ సామా జిక వర్గానికి చెందిన వారికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు పొలిటి కల్ సర్క్యూట్ లో చర్చ కొనసాగుతోంది. అందుకే వీరభద్ర గౌడ్ సపోర్ట్ ఇవ్వ కుండా వారికే ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారన్న సంకేతాలు అన్నదాత సుఖీభవ కార్యక్ర మంలో తేటతెల్లమయ్యాయని చర్చించుకుంటున్నారట. మొత్తం మీద ఆలూరు నియో జకవర్గం లో రెండు వర్గాల మధ్య పోరు ఇప్పట్లో చల్లారే అవకాశం కనపడటం లేదట.. పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి తే తప్ప ఇక్కడ నెలకొన్న సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది..