
Pawan Kalyan Trishul Elements: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇటీవల విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో త్రిశూల్ అనే కొత్త విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ త్రిశూల్‌కు కార్యాచరణ రూపొందిస్తామని పవన్ తెలిపారు. పార్టీకి.. ముఖ్యంగా వచ్చే 10 సంవత్సరాల భవితవ్యానికి కూడా ఈ త్రిశూల్ కీలకమని వెల్లడించారు. మెరికల్లాంటి యువతను పార్టీలోకి తీసుకుని.. వారిని బలమైన నాయకులుగా ఎదిగేలా చేస్తామని చెప్పారు.
అయితే ఈ త్రిశూల్ కార్యక్రమానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మూడు రూపా ల్లో పార్టీ కార్యకర్తలను తయారు చేయాలన్నది పవన్ ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఐఐటీ మద్రాస్ నిపు ణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా కార్యకర్తల ను నియమించుకుని.. వారికి బలమైన శిక్షణ ఇవ్వడం ద్వారా పార్టీకి వినియోగించుకోవాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో ఐఐటీ మద్రాస్ నిపుణుల ద్వారా కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నట్టు తెలుస్తోంది.
సైద్ధాంతిక నిబద్ధత: జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలపై యువతకు ముందుగా శిక్షణ ఇస్తా రు. అదేవిధంగా ప్రజల సమస్యలు, పార్టీకి సంబంధించి అంశాలపై చర్చిస్తారు. వారిలో సేవా తత్పరతను ప్రోది చేస్తారు. బలమైన ఆకాంక్షను పెంచుతారు. తద్వారా పార్టీ తరఫున ప్రజల మధ్యకు వెళ్లేందుకు వారి లో స్ఫూర్తిని రగిలిస్తారు.
నాయకత్వం: పార్టీలో చేరిన వారు.. ప్రస్తుతం ఏచేయాలన్న విషయంపై సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తే.. ఏం జరుగుతుందో అనే చర్చ కూడా ఉంది. ఇక, మీదట అలాంటి చర్చకు తావు లేకుండా.. నాయకత్వ పటిమను పెంచుతారు. ప్రతి మూడు మాసాలకు కార్యకర్తల నుంచి నాయకులను తయారు చేస్తారు. లేదా గుర్తిస్తారు. వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు.తద్వారా.. పార్టీలో గుర్తింపు లభించేలా చేస్తారు. ఇది నాయకుల సంఖ్యను పెంచేందుకు దోహదపడనుంది. ఇది రెండో మంత్రం.
పార్టీలో కీలక పోస్టులు: ఇలా.. రెండు రూపాల్లోనూ యువతకు శిక్షణ ఇచ్చిన అనంతరం.. వారిని పార్టీలో ప్రధాన కార్యదర్శులుగా నియమించే దిశగా ఆలోచన చేస్తున్నారు. తర్వాత.. వీరికి కీలక బాధ్యతలను కూ డా అప్పగిస్తారు. ఇలా మూడు రూపాల్లో బలమైన శిక్షణను ఇచ్చి.. మెరికల్లాంటి నాయకులను రూపొందిం చేందుకు పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఐఐటీ మద్రాస్ నిపుణులతో సంప్రదింపులు జరుపు తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కార్యక్రమానికి ఒక రూపం తీసుకువచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. Pawan Kalyan Trishul Elements.
ఇది తారకమంత్రంగా పనిచేస్తుం దని… దీంతో ఇప్పుడు ఏ ఇద్దరు జనసేన కార్యకర్తలు కలుసుకున్నా.. త్రిశూల్ గురించిన చర్చే జరుగుతోంది. మరి ఇది ఏంటి? దీనివల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది? పార్టీ ఏవిధంగా పుంజుకుంటుంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q