
Pemmasani Chandra Sekhar Guntur District Union Minister: ఆయన ఓ కేంద్ర మంత్రి. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు. ఎన్నికల్లో ఏ హామీలైతే ఇచ్చారో, ఏం చేస్తామని చెప్పారో అవి చేతల్లో చూపుతున్నారు. జనం మెప్పు పొందుతున్నారు. ఇంతకీ ఎవరాయన. చూద్దాం.
గత పార్లమెంట్ ఎన్నికలలో గుంటూరు ఎంపీ సీటు నుంచి కూటమి గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు పెమ్మసాని చంద్రశేఖర్. గెలిచిన నాటి నంచి గుంటూరు పార్లమెంట్ కు ఏదో చేయాలనే తపనతో ప్రణాళికా బద్దంగా పనిచేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారట. వారి ప్రాంతాల్లో సమస్యలను తెల్సుకుంటూ, వాటి పరిష్కారం దిశంగా చర్యలు తీసుకుంటున్నారు చంద్రశేఖర్.
40 సంవత్సరాల నుంచి గుంటూరు వాసులు ఇబ్బంది పడుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి వెడల్పుకు శ్రీకారం చుట్టారు పెమ్మసాని. అలాగే గుంటూరు వెస్ట్, ఈస్ట్, పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు అధికారులను సమన్వయం చేసుకుంటూ శంకర్ విలాస్ బ్రిడ్జి డీపీఆర్ రెడీ చేయించారు. అది పూర్తి అవ్వగానే స్వయంగా తానే ఢిల్లీ వెళ్లి పట్టణాభివృద్ధి, రైల్వే శాఖల అధికారులతో మాట్లాడి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులకోసం మొదటి విడతగా 98 కోట్ల రూపాయలు మంజూరు చేయించారట. ఆ తర్వాత శంకుస్థాపన పనులు కూడా చకచకా చేయించారు పెమ్మసాని. Pemmasani Chandra Sekhar Guntur District Union Minister.
అంతేకాదు, 2019 నుంచి పెండింగులో ఉన్న నందివెలుగు బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఇబ్బంది పడటంతో వారికోసం మండల స్థాయిలలో నల్లబెర్లి పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. గత మూడున్నర సంవత్సరాల నుంచి ఏపీలో ఎన్జీఆర్ఎస్ పనుల నిధులు ఆగిపోవడంతో జులై మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులను విడుదల చేయించారట. తన పనితీరుతో అటు ప్రజలకు మంచిచేస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనంలో కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పెరగడంలో తన వంతు సాయం చేస్తున్నారట.