
MLA Koneti Adimulam Suspended: ఆ నియోజకవర్గ టిడిపికి కంచుకోట, 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వ్యక్తికి పట్టం కట్టి ఎమ్మెల్యే స్థానాన్ని కట్టబెట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. కానీ ఆయన పై వచ్చిన ఆరోపణలతో పార్టీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి పక్కన పెట్టింది. కానీ ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరవుతారు,అది నాయకుడు జిల్లాకు వచ్చిన హాజరవుతారు, ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ అధిష్టానం ఇన్చార్జిగా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఒకరిని నియమించింది టీడీపీ అధిష్టానం. దీంతో ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలలో తెలుగుదేశం, జనసేన లకు ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో తెలుగుదేశం, జనసేన జెండాలు రెపరెపలాడాయి. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం లో కోనేటి ఆదిమూలం వైయస్సార్సీపి నుంచి టిడిపిలోకి చేరి గెలిచారు.2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ నుంచి భారీ మెజారిటీ తో గెలిచినా ఆదిమూలం 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ సత్యవేడు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డిని ఏదిరించి వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకొని కూటమి ప్రభుత్వం లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు ఆదిమూలం.అయితే గెలిచిన కొన్ని నెలలకే స్థానిక టిడిపి మహిళా సభ్యురాలిని లైంగిక వేదింపులకు గురి చేశారని అసభ్యకరమైన వీడియోలు బయటికి రావడంతో టిడిపి పార్టీ క్యాడర్ దెబ్బతింటుందని పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.ఆదిమూలంని సస్పెండ్ చేసిన తరువాత సత్యవేడు టిడిపి క్యాడర్‌ను బలపరిచేందుకు కుటమి ప్రభుత్వం కొత్త ఇన్చార్జిగా శంకర్ రెడ్డిని ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా నియమించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది అధికారిక కార్యక్రమాలలో ఇటు కేడర్ అటు అధికారులు ఇద్దరి మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం
ఇది SC రిజర్వడ్ నియోజకవర్గం కాబట్టే ఇలా చేస్తున్నారని వేరే నియోజకవర్గం లో ఇలా చెయ్యగలరా అని ప్రోటో కాల్ ని ఉల్లాగిస్తున్నారని ఆదిమూలం మండిపడుతున్నారట.శంకర్ రెడ్డి వచ్చి రాగానే స్థానిక అక్రమాలకు చెక్ పెట్టారన్నది స్థానికుల మాట, అక్రమాలపై దృష్టి పెట్టడంలో సగానికి పైగా సత్యవేడు ప్రజలు ఆయన వైపు తిరిగారట,అదే సమయంలో శంకర్ రెడ్డి కొంత మంది వైసీపీ నాయకులను టిడిపి పార్టీలో చేర్చుకోవడంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత చేస్తున్నారని కొందరు శంకర్ రెడ్డి పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కానీ ఆదిమూలం వైఖరి సత్యవేడులో మరోసారి హార్ట్ టాపిక్ అయింది. పార్టీ సస్పెండ్‌ను పార్టీ ఎత్తి వేయకపోతుందా అని ఎదురుచూస్తున్నరట ఆదిమూలం. ఆదిమూలమును కాదని శంకర్ రెడ్డిని నియమించడం తో ఇవేమీ ఇంకా జరగవు అనుకున్నారో ఏమో కానీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన పని తాను చేసుకు పోతున్నాడు. కానీ శంకర్ రెడ్డి దూకుడు చూస్తుంటే ఇవేవీ జరిగేటు కనిపించేలా లేవని భావించిన ఎమ్మెల్యే ఆదిమూలం నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకోవడం కోసం ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
అయితే శంకర్ రెడ్డి ఆదిమూలం మరోవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో ఇటు తెలుగు తమ్ముళ్లకు అటు అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారిందంటూ గుసగుసలు వినబడుతున్నాయి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శంకరరెడ్డి కి ప్రజలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుటుండటంతో పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో దూకుడు పెంచేశారు శంకర్ రెడ్డి.
అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శంకర్ రెడ్డి బాధితులకు అందించడం,శంకర్ రెడ్డి పై ఆదిమూలం మండిపడుతున్నరట, స్థానిక ఎమ్మెల్యే ని నేను ఉండగా నన్ను కాదని ఒకరు నమన్వయకర్త, మరొకరు కోఆర్డినేటర్, ఇంకొకరు పరిశీలకులు అంటూ సత్యవేడుకు ఎంతమంది ఇంచార్జులను పెడతారు అని మండిపడుతున్నారట ఎమ్మెల్యే ఆదిమూలం.ఈ మధ్య ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారుల కంటే ముందే ఆయన వచ్చి నానారచ్చ చేస్తున్నారట ఆదిమూలం. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం.ఇక ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన శ్రీ శక్తి పథకం ప్రారంభించడానికి ఆదిమూలం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండి శ్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు.దీనికోసం అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న శంకర్ రెడ్డికి ఇది ఇబ్బందికరంగా మారిందట. MLA Koneti Adimulam Suspended.
ఇక జడ్పీ సమావేశంలో సైతం ఆదిమూలం అదే ధోరణి తో మాట్లాడారట. కనీసం ఎటువంటి సమాచారం అధికారులు ఇవ్వటం లేదని దీనిపై పోరాటం సాగిస్తానని హెచ్చరించారట.ఆదిమూలం సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఇక పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేయటం ఖాయమని ప్రజలు చెవులు కోరుకుంటున్నారట,సత్యవేడులో టిడిపి క్యాడర్ బలపడుతుందా లేక వైసీపీ పార్టీ బలపడుతుందా అన్నది వేచి చూడాలి.సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపికి కంచుకోటనే చెప్పుకోవాలి గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువసార్లు టీడీపీ నే ఈ నియోజకవర్గంలో జండా ఎగారావేసింది. కానీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహార శైలితో టిడిపి ఆ నియోజకవర్గంలో ఇరకాటంలో పడిందని చెప్పాలి. చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకొని అక్కడ టిడిపిని ఏ విధంగా బలోపేతం చేస్తుందో వేచి చూడాలి మరి. శంకర్ రెడ్డి కి పూర్తి బాధ్యతలు ఇస్తే ఆ నియోజకవర్గంలో టిడిపిని బతికించుకోవచ్చని స్థానిక నాయకుల అభిప్రాయమట.