
Shrimp farmers in trouble: ఉమ్మడి ఉభయగిదావరి జిల్లాలో అక్వా పరిశ్రమ ఒకప్పుడు సిరులు కురిపించింది.. చేస్తే రొయ్యల సాగు చెయ్యాలి, జీవితంలో స్థిరపడిపోవచ్చు అనే స్థాయి నుంచి నేడు రొయ్యల చెరువుల మాటేత్తితే ఉలిక్కి పడుతున్నారు. వద్దురా బాబు రొయ్యల సాగు అంటూ చిరాకు పడుతున్నారు. అప్పుల పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. సిరులు కురిపించిన రొయ్యల సాగు, ఇప్పుడు ఇంతలా రైతులను ఇబ్బందులకు గురి చెయ్యడానికి కారణాలేంటి?
రొయ్యల చెరువులు ఉన్నవారు అంటే ఒకప్పుడు స్టేటస్కు సింబల్ గా ఉండేది.ఖరీదైన కార్లు, భవనాలు,భూములు కొనుగోలు చేసే వారిలో ఎక్కువ రొయ్యల రైతులే ఉండేవారు.రొయ్యల రైతుల పంట పండితేమార్కెట్లో ఇతర వ్యాపార సంస్థలుకళకళలాడివి. గడచిన కొన్నేళ్లుగారొయ్యల చెరువులురైతుల పాలిట గుది పండగమారాయి. వివిధ రకాల వైరస్లు శోకడంతో పంట నష్టాలను సరి చూడవలసివస్తుంది.దీంతో వీరు అప్పుల పాలవడం మొదలైంది.రొయ్యల వ్యవసాయం అంటే బెట్టింగ్లా మారింది.రొయ్యల రైతుల్లో కొంతమందితమ ఆస్తులను సైతం అమ్ముకొని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా కోనసీమ జిల్లాలో కనిపిస్తాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో హామీలో భాగంగారొయ్యల రైతులకు విద్యుత్తు సబ్సిడీ ప్రకటించింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిఏడాది గడుస్తున్నప్పటికీ ఈ విషయంలో ఎక్కడికి గొంగళి అక్కడే ఉంది.రొయ్యల దిగుబడి చేతికి వచ్చేటప్పటికి వ్యాపారులు సిండికేట్లుగా మారి రొయ్యల ధరలను అమాంతం తగ్గించేస్తూ తమ పొట్ట కొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.దీనికి తోడు రొయ్యలకు వినియోగించే మేతల ధరలను కూడా విపరీతంగా పెంచేయడం వల్లమరింత ఆర్థిక భారం పడుతుందని వీరు గగ్గోలు పెడుతున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రొయ్యల ఎగుమతి విషయంలోభారత పట్ల వివక్షత చూపుతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.ముఖ్యంగా ఆ దేశానికి రొయ్యలుఎగుమతి చేసే రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ట్రంపు 25% సుంకాలు విధిస్తూ సంతకాలు చేయడంతో ఆ భారం మరింత పెరుగుతుందనిరైతులు కలవర పడుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి సుంకాలు తోడు అయితే నిండా మునిగిపోతామని వీరు ఆందోళన చెందుతున్నారు. సుమారు 16 లక్షల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి.2.50 లక్షల ఎకరాల్లో ఏటా సుమారు 7 లక్షల టన్నుల రొయ్యలుఉత్పత్తి అవుతున్నాయి.ఉమ్మడితూర్పు పశ్చిమగోదావరి జిల్లాలతో పాటుఏలూరు,కృష్ణ,బాపట్ల,ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ సాగు అధికంగా ఉంది.దేశవ్యాప్తంగా 2023- 2024 సంవత్సరంలో60,524 కోట్ల సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు జరిగితే అందులో అమెరికాకే 21 వేల కోట్ల సరుకు ఎగుమతి జరిగింది. ఇందులో రొయ్యలు2.93లక్షల టన్నులు ఉండడం విశేషం. Shrimp farmers in trouble.
అమెరికా అధ్యక్షుడు ట్రంపు వంకతో రొయ్యల వ్యాపారులు మాయ చేస్తున్నారని ఈ రంగంలో విశేషా అనుభవం ఉన్నత్స వట పల్లి నాగభూషణం అనే రైతు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుదృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తామని ఈ సందర్భంగా భూషణం పేర్కొన్నారు.