శ్యామల రావు… స్వయంకృతాపరాధం…!

TTD EO Shyamala Rao: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా పనిచేసే అవకాశం దక్కడం కోసం ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు. అలా టీటీడీ ఇవ్వగా వచ్చిన తర్వాత భక్తుల సేవలో తరిస్తూ అధిష్టానంతో సన్నిహితంగా ఉంటూ వీలైనంత రోజులు తిరుమలలోని అదే స్థానంలో కొనసాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ నేరుగా భక్తులకు సేవ చేసే అవకాశం… దక్కడమే కాకుండా… దేశంలోని రాష్ట్రపతి ప్రధానమంత్రి నుండి అత్యున్నత రాజ్యాంగ పదవుల లో ఉన్న వారందరూ శ్రీవారి భక్తులుగా స్వామి వారి దర్శనానికి రావడం వారితో పరిచయాలు, ఇలా అన్ని రకాలుగా ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది.

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువైన తర్వాత తొలి ఐఏఎస్ గా టీటీడీ ఈవో గా నియమితులైన శ్యామల రావు అనూహ్యంగా ఏడాది కాలం పూర్తి చేసుకోగానే మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకొని బదిలీ కి గురయ్యారు. ఏడాది కాలానికే టిటిడిశ్యామలరావు బదిలీ కావడంలో స్వయంకృతాపరాధమే అని అంటున్నారు విశ్లేషకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మెట్టమెదటి నియామకంగా శ్యామల రావును టిటిడి ఇవోగా నియమించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం తో అసంతృప్తికి గురయ్యారు. తిరుమలేసిన లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి పూర్తిస్థాయిలో కల్తీ జరిగిందంటూ అందులో జంతు కొవ్వు లాంటి మాంసపు అవశేషాలు నెయ్యిలో కలిసాయి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పుడు సమాచారం అందించి అటు తరువాత ఆశించిన స్థాయిలో నేరస్తులను అరెస్టు చేయించలేక, నెయ్యిలో జంతు కొవ్వు లాంటి మాంసపు అవశేషాలు ఏవి లేదని లేబరేటరీలో నిర్ధారణ అయిన తరువాత అసలు నెయ్యి కల్తీ జరిగిందని నెయ్యికి బదులు డాల్డా టీటీడీకి సరఫరా చేశారని రకరకాలుగా ఆరోపణలు తెెర మీదకి రావడం.. శ్యామల రావు ఇచ్చిన రాంగ్ ఫీడ్ బ్యాక్ కారణంగానే జరిగింది అని మరో వాదన.ఈ విషయంలో ప్రభుత్వానికి అభాసు పాలయ్యే విధంగా వ్యవహరించిన పరిస్థితి శ్యామల రావుదని అభిప్రాయం వ్యక్తం చేశారు విశ్లేషకులు.

ఇదే కాకుండా పాలకమండలి ఏర్పడిన తర్వాత పాలకమండలికి ఈవో కు మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలను అమలు చేయాల్సిన కార్య నిర్వహణ అధికారి అందుకు విరుద్ధంగా పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తో అనేక అంశాలలో విభేదించారు. బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా కావాలనే ఉద్దేేశ పూర్వకంగా అలసత్వం చేశారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జాారీ సమయంలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా.. స్వయంగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పై ముఖ్యమంత్రి సమక్షంలోనే శ్యామల రావు వాదులాటకు దిగారు. మరో సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకొని బి ఆర్ నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను కచ్చితంగా అధికారులు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీకి ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ సుప్రీం అంటూ స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. బి ఆర్ నాయుడు ను తాను అంత తేలిగ్గా టిటిడి చైర్మన్ గా నియమించలేదని, పార్టీలో 42 ఏళ్ల పాటు ఎన్టీ రామారావు హయాం నుండి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కేసులు పెట్టించుకుని అనేక ఇబ్బందులు పడి పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి బిఆర్ నాయుడు అని స్వయంగా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవో తో పాటు ఇతర ముఖ్యుల ముందు తేల్చి చెప్పారు. అయినా కూడా శ్యామల రావు లో ఎటువంటి మార్పు లేకపోవడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.

గతంలో డిప్యూటేషన్ పై వచ్చిన వారిని తొలగించాలంటూ సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ శ్యామలరావు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ రెవెన్యూ పంచాయతీ అధికారిగా పనిచేసిన అవినీతి సామ్రాట్ కు అండగా నిలవడం, ఆయనతోపాటు మరి కొంతమంది ప్రభుత్వానికి సాగనంపాల్సిన విశ్రాంత అధికారులను తన కోటరీగా ఏర్పాటు చేసుకొని వారికి ప్రాధాన్యత ఇవ్వడం తదితర వివాదాస్పదమైన అంశాలతొ శ్యామల రావు కోరి సమస్యలను తెచ్చుకున్నారు. టిటిడి గోశాలలో గోవుల సహజ మరణాన్ని రాజకీయం చేసిన వైసీపీ నాయకుల వైఖరిపై మరింత ఆజ్యం పోస్తూ ఈవో టిటిడి పాలక మండలిని ఇరుకున పెట్టేలాగా మీడియా సమావేశం నిర్వహించి గోవుల మరణం సంఖ్యను పెంచి చెప్పడం.. ప్రభుత్వాన్ని సైతం ఇబ్బందుల్లోకి నెట్టింది. టీటీడీలో అత్యంత కీలకమైన అంశముగా శ్రీవారి దర్శనాన్ని కేవలం గంట సమయంలో భక్తులకు చేయించే అంశంలో టీటీడీ చైర్మన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ విధానాన్ని టిటిడిలోకి ప్రవేశపెట్టడం. అయితే ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడం కోసం ప్రముఖ సాంకేతిక సంస్థలైన గూగుల్, టిసిఎస్ సంస్థలు పోటీపడ్డాయి. TTD EO Shyamala Rao.

ఇందులో కూడా ఉచితంగా టీటీడీకి సర్వీసును అందించేందుకు ముందుకొచ్చిన గూగుల్ సంస్థను పక్కనపెట్టి ఏటా కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తున్న టిసిఎస్ సంస్థకు ఏఐ విధానం పై బాధ్యతలను అప్పగించాలని ఈవో శ్యామలరావు గట్టి ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా గూగుల్ కే పనులు అప్పగించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఈవో శ్యామలరావు టీటీడీకి భారమయ్యే విధంగా టిసిఎస్ సంస్థ వైపే మగ్గుచూపుతూ వెంకయ్య చౌదరితోను విభేదించినట్లు సమాచారం. టిటిడిలో అవినీతికి అవకాశం ఉన్న విభాగంతో పాటు ఎస్ వి బి సి లో ప్రక్షాళన వదిలేసి గతంలో వివాదాల్లో ఉన్న వారికే పెద్దపీట వేశారని ఆరోపణలున్నాయి. టిటిడి ఉద్యోగులు బదిలీలు వ్యవహారంలో గతంలో పనిచేసిన అధికారి మాటకే విలువ ఇచ్చాడని కూటమి వర్గాల ఆరోపణ చేశారు. చిన్నన చిన్న తప్పులకు కూడా కొంతమంది మహిళా టిటిడి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉద్యోగాల నుండి తొలగించడం పై ఎంప్లాయిస్ యూనియన్ ఆగ్రహంతో ఉన్నారు. వైైసీపీ సానుభూతిపరులుగా ముద్రపడిన అనేకమంది టీటీడీ ఉద్యోగులు యధావిధిగా కీలక స్థానాల్లో కొనసాగుతూ ఉంటే ప్రక్షాళన చేయటం మానేసి చాలామంది బదిలీల విషయంలో పట్టించుకోలేదనేది శ్యామలరావు పైన ప్రధాన ఆరోపణలు.ప్రభుత్వం నుండి టీటీడీ లోని కొంతమంది వివాదాస్పద ఉద్యోగులపై వారి పనితీరుపై విచారణ చేస్తూ నివేదిక అందించాలని సమాచారం వచ్చినా పట్టించుకోలేదని ఈవో పై విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ 50 మంది పైన నివేదిక ఇచ్చినప్పటికీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

లడ్డు ప్రసాదాలకు వినియోగించే
నెయ్యి కల్తీ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా సరుకుల నాణ్యత పెంచి లడ్డూను భక్తులకు అంద చేయడంలో కీలక పాత్ర వహించిన ఇవో శ్యామలరావు, లడ్డు నాణ్యతలను పెంచడంలోనూ, తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులకు అన్ననప్రసాదాల నాణ్యత పెంచి భక్తుల చేత శభాష్ అనిపించుకోవడంలోనూ ప్రముఖ పాత్ర వహించారు. ఎటువంటి అనుభవం లేకపోయినా గత ఏడాది బ్రహ్మోత్సవాలు విజయవంతము చేసిన ఘనత శ్యామలరావుకు దక్కింది. ఏది ఏమైనా నీతి నిజాయితీగా పనిచేస్తూ వివాదారహితుడుగా పనిచేస్తున్న టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుతో సఖ్యతగా లేకుండా బోర్డు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు చేయకుండా ఉదేశపూర్వకంగా ఆలస్యం చేయడం తో ఈవో శ్యామలరావు బదిలీ తప్పదని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ప్రభుత్వం దీన్ని నిజం చేస్తూ శ్యామల రావుని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ స్థానానికి బదిలీ చేయడం గతంలో పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కు మూడవసారి పనిచేసే అరుదైన అవకాశం కల్పించడం ఇకనైనా టిటిడిలో పరిపాలన సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నారు భక్తులు.