AP సర్కార్ స్కూలకి స్మార్ట్ కిచెన్..!

Smart Kitchen For Government Schools: ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇక కూటమి హయాంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విద్యార్థులకు యూనిఫాం, బ్యాగ్‌లు, సిలబస్, వివిధ పథకాలను సమూలంగా మార్పులు చేశారు. ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేశారు. అంతేకాదు, సమస్యలు చెప్పుకోవడానికి మెగా పేరెంట్ – టీచర్ సమావేశాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో ఓ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. ఇంతకు ఆ ప్రభుత్వ పాఠశాల ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

డొక్కా సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధుల నుంచి అందించారు.

కడపలో మధ్యాహ్న భోజన పథకం కోసం దేశంలో మొట్టమొదటి స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. కడపమునిసిపల్(మెయిన్ )హైస్కూల్ ల్లో ఈ స్మార్ట్ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నిధులతో ఏర్పాటైంది. డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్నా బడి భోజనం పథకంలో భాగంగా ఈ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి స్మార్ట్ కిచెన్ ద్వారా రుచికరమైన,శుబ్రమైన భోజనం విద్యార్థులకు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోంది. మొదటి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలలో భాగంగా కడప మునిసిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ పాఠశాలలో కట్టెల పొయ్యి మీద భోజనాలు చేసి పిల్లలకు వడ్డించడాన్నిగమనించిన డిప్యూటీ సీఎం మధ్యాహ్న భోజనాన్ని శుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో వండించాలన్న ఉద్యేశంతో తన సొంత నిధులు అందించారు.ఆ నిధులతో స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది.

పిల్లలు ప్రభుత్వ బడికి వచ్చి చదువుకునేలా చేయడంతో పాటు వారికి పోషకాలు అందించేందుకు అమలు చేస్తున్నదే మధ్యాహ్న భోజన పథకం. అయితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవడమే కాకుండా మధ్యాహ్న భోజనం పథకంలో కూడా సమూల మార్పులు తెచ్చింది కూటమి ప్రభుత్వం. పిల్లలకు సన్నబియ్యంతో వండిన అన్నం, పోషకాలను అందించాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ యంత్రాంగం తరపున కడపలో స్మార్ట్‌ కిచెన్‌ ఏర్పాటు చేసి అత్యంత నాణ్యమైన, పోషహాకార భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ, అందించిన ఆర్థిక సాయంతో కడప మున్సిపల్ హైస్కూల్‌లో స్మార్ట్ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2 వేలమందికి పైగానే పిల్లలకు రుచికరమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.

పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం ఓ అద్భుతమైన కార్యక్రమం. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థలో సంస్కరణలు ప్రారంభించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మరిన్ని మార్పులు జరుగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఉండే మధ్యాహ్నం భోజనం పథకం వంటగది స్థానంలో స్మార్ట్ కిచెన్ సిద్ధమవుతున్నాయి.

తాజాగా కడపలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ వీడియోను ఏపీ డిప్యూటీ సీఎంవో ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. డొక్కా సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో స్మార్ట్ కిచెన్ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి పవన్ వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. అయితే ఈ స్మార్ట్ కిచెన్‌ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత నిధులు రూ.10 లక్షల ఆర్థికం సాయం అందజేశారు. గతేడాది ఆ స్కూల్‌లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఇచ్చిన హామీ మేరకు నిధులను అందించారు.

ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో స్మార్ట్ కిచెన్ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి.

స్టార్ హోటల్ కిచెన్ తరహాలో ఏర్పాటైన ఈ స్మార్ట్ కిచెన్ లో పని చేస్తున్న వంట కార్మికులు, డ్రెస్ కోడ్ తో పాటు వంట వార్పులలో పరిశుభ్రతా చర్యలు పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాల తయారీ చేపడుతున్నారు. ఆహార రవాణా వాహన ట్రాకింగ్ లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ లో బల్క్ కుకింగ్ ఏరియా,స్టోరేజ్ రూమ్, గ్రైండింగ్ ఏరియా, వెజిటబుల్ కటింగ్ ఏరియా, ఫ్రూట్ ఆనియన్ స్టోర్ , పాట్ వాష్ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలతో పాటు స్మార్ట్ కిచెన్ భద్రత కట్టు దిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రతి కిచెన్ కు నుండి 3 కిలో వాట్ల సోలార్ పవర్ జనరేషన్ యూనిట్లు ఏర్పాటు చేశారు. .

మిగిలిపోయిన భోజన పదార్థాలు మరియు కూరగాయల వ్యర్థాలను బయో డిగ్రేషన్ ద్వారా మిథైన్ గ్యాస్ గా మార్చి వంటకు ఉపయోగిస్తున్నారు. వంట వండే సిబ్బందికి న్యూట్రిషనలిస్టు ద్వారా శిక్షణ ఇప్పిచ్చి వంట వండే విధానం లో న్యూట్రిషన్ విలువలు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఒక్కోరోజు ఒక్కో రకమైన మెనూలో కూడిన బోజనాలు అందిస్తున్నారు. సోమవారం తెల్లన్నం, కూరగాయల కూర, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కి అందిస్తున్నారు. మంగళవారం: పులగం,నిమ్మకాయల/ చింతపండు పులిహోర, పల్లి చట్నీ, గుడ్లు, రాగిజావ, ఇక బుధవారం తెల్లన్నం, కూరగాయల సాంబార్, ఉడకపెట్టిన గుడ్లు, చిక్కి అందిస్తున్నారు. గురువారం కూరగాయల అన్నం, గుడ్ల కూర, రాగిజావ, అలాగే శుక్రవారం తెల్లన్నం ఆకుకూర పప్పు ఉడకపెట్టిన గుడ్లు, చిక్కిఅందిస్తున్నారు. ఇక శనివారం తెల్లన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి రాగి జావ అందిస్తున్నారు

ఇక, ఆ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసిన విధానం.. అక్కడ సిబ్బంది భోజనం తయారు కోసం పాటిస్తున్న ప్రమాణాలను పలువురు అభినందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సొంత నిధులు సమకూర్చగా, కడప పురపాలక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్‌ కిచెన్‌ నిర్మాణం పూర్తైంది. ప్రభుత్వ పాఠశాలలు స్వయంగా నిర్వహించే ఈ స్మార్ట్‌కిచెన్‌ దేశంలోనే మొదటిదని అధికారులు చెబుతున్నారు. Smart Kitchen For Government Schools.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ కార్యక్రమం 12 పాఠశాలల విద్యార్థులకు సురక్షితమైన మరియు పోషకమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తన విద్యా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక మార్గదర్శక చర్య.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q