
Tirupati TDP Party President: తిరుపతి పార్లమెంటు అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందో అనే ఉత్కంఠ తిరుపతిలో నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడుతుంది. భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా యువత ఆలోచనను వినియోగించుకునే విధంగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం లో మంత్రులు సైతం యువతకే ప్రాధాన్యత కల్పించారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంత్రి పదవులు కూడా కూటమి ప్రాభిత్వంలోనే సాధ్యమని చెప్పాలి.
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పార్లమెంటు ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది దానికి అధ్యక్షుడిగా ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. పార్లమెంట్ అధ్యక్ష పదవికి మాత్రం చాలామంది ఆసవాలు ఎదురుచూస్తున్నట.రెండు రోజుల క్రితం తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ విస్మృతస్థాయి సమావేశంలో …. పార్లమెంట్ ప్రధాన కమిటీ, అనుబంధ కమిటీలు సాధికారికమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర మంత్రి సవిత మరియు కమీట సభ్యులు.తిరుపతి పార్లమెంట్ టిడిపి పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎంతో మంది ఆశావాహులు తమ తమ బయోడేటాలను పార్లమెంటరీ కమిటీకి సమర్పించారు.
ఇంతకుముందు తిరుపతి పార్లమెంటు టిడిపి పార్టీ అధ్యక్షుడుగా నరసింహ యాదవ్ కొనసాగారు ఆయనకు యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి రావడంతో ఆయన నిర్వహిస్తున్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు పదవి వేరొకరికి ఇవ్వాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడిగా చాలామంది ఆసవాలు వెదురు చేస్తున్నారు..ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం,ఎన్టీఆర్ కుటుంబానికి అతి సన్నిహితుడుగా ఉన్న ఎన్టీఆర్ రాజు కొడుకు అయినా శ్రీధర్ వర్మ పేర్లు బలంగా వినబడుతుంది.ఎన్టీ రామారావు కాలం నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ రాజు కుటుంబం టిడిపికి అటు తిరుమలలో ఇటు తిరుపతిలో పార్టీకి పనిచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నప్పటికీ శ్రీధర్ వర్మకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఆయన ముఖ్యంగా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గా అందరికీ సుపరిచితుడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మబ్బు దేవ నారాయణ రెడ్డి తిరుపతిలో బలమైన నాయకుడు. ఆ సామాజిక వర్గంలో ఆయనకి గట్టి పట్టుంది. ఆయన అందరిని కలుపుకొని పోయే వ్యక్తిగా మంచి పేరుంది.
ప్రధాన ఎన్నికలలో అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూడా ఆయన తనదైన శైలిలో రాజకీయ చతురతను ఉపయోగించి డిప్యూటీ మేయర్ పదవి కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర వహించారు. అలాగే డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కూడా చదువుకున్న వ్యక్తి లోకేష్ కి అతి సన్నిహితుడు ఇలా ఎవరి లెక్కలు వారికున్నప్పటికీ అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.అయితే ఇప్పుడు ఈ రేసులో తిరుపతికి చెందిన టిడిపి జోన్ ఫోర్ మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ పేరు బలంగా వినపడుతోందని… తిరుపతి జిల్లా పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు శ్రీధర్ వర్మ పేరును కమిటీ సభ్యులకు సూచించినట్లు సమాచారం.మరోపక్క ఇదే పదవి కోసం జిల్లాలోని పలువురు ఆశావాహులు తమ తమ బయోడేటాను కమిటీ సభ్యులకు సమర్పించారు. Tirupati TDP Party President.
జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలను టిడిపి ప్రధాన కార్యాలయం చేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో సంప్రదింపులు చేసుకున్న అనంతరం….తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు పదవి ఎవరా అన్నది మరో రెండు మూడు రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మూడు నెలలు గడుస్తున్న చాలాచోట్ల నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోవడంపై తెలుగుదేశం కేడర్లో అసంతృప్తి నెలకొందని సమాచారం. కానీ చంద్రబాబు నాయుడు ఆచితూచి ప్రభుత్వానికి, ప్రజలకు మంచి చేసే నాయకులను, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరికొంత మంది టిడిపి కేడర్.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q