
Tirupati TDP In-charge: ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో టిడిపి ఇన్చార్జి నియామకంపై సస్పెన్న్స్ కొనసాగుతోంది. మొన్నటి వరకు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇంచార్జీగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు రాష్ట్ర క్లినింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో తిరుపతి టిడిపి ఇన్చార్జి స్థానం ఖాళీ అయినట్లు అయింది. అయితే ఇప్పుడు తిరుపతి టిడిపి ఇన్చార్జి పదవి ఎవరికి కేటాయిస్తారన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులు రాని చాలామంది ఆశావాహులు ఇన్చార్జి పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తిరుపతి టిడిపి ఇన్చార్జి పదవి దక్కించుకోవాలని చాలామంది ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. మహానాడు కన్నా ముందే తిరుపతి ఇంచార్జ్ ని ప్రకటిస్తారు అని అందరూ భావించారు. కానీ మహానాడు అయిన తర్వాత కూడా టిడిపి తిరుపతి ఇన్చార్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించకపోవడంతో చాలామంది ఆసవాహనంలో ఉన్నారట. ముఖ్యంగా టిడిపి నేత నరిసింహ యాదవ్ కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం, విజయ్ కుమార్ కు ఏపి అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నామినేటెడ్ పదవి రావడంతో వీరిద్దరూ రేస్ నుంచి తప్పుకున్నట్ల అయ్యింది.
ముఖ్యంగా తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నేత శ్రీనివాస్ రేసులో ఉన్నారట. ఆయనే కాదు, ప్రముఖ విద్యావేత్త ఎడిఫై విద్యాసంస్థల అధినేత ప్రణీత్, మబ్బు దేవనారాయణరెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం ప్రధానంగా ఇప్పుడు ఇన్చార్జి పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ, దీంతో టిడిపి ఇన్చార్జి పదవి బలిజ సామాజక వర్గానికే కేటాయిస్తారు అని సమాచారం. ముఖ్యంగా యువ నాయకుడు ప్రణీత్ టిడిపి ఇన్చార్జి అవ్వడం ఖాయమంటూ ప్రచారం కూడా జరుగుతోంది. సౌమ్యుడు విద్యావంతుడు కావడంతో పాటు బలిజ సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అంశంగా ప్రచారం జరుగుతోంది.
అలాగే మరో యువనేత శ్రీనివాస్ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినవారే. ఈయన పేరు కూడా తిరుపతి ఇన్చార్జి అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ కు కలిసి వచ్చే అంశాలలో మొదటిది రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు తోపాటు తిరుపతి జిల్లా ఇంచార్జీ మంత్రి అనగాని సత్యప్రసాద్ సపోర్ట్ బలంగా ఉందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి కార్పొరేషన్ డీప్యూటి మేయర్ ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ తనదైన శైలిలో రాజకీయ చతురత ప్రదర్శించారట. అలాగే వైసిపికి చెందిన అసంతృప్తి కార్పొరేట్లను టీడీపీ వైపు తీప్పుకోవడంలో ప్రధాన భూమిక పోషించారట. దీంతో కార్పొరేషన్ డీప్యూటి మేయర్ ఎన్నిక టిడిపి ఖాతాలోకి చేరింది. ఈ మొత్తం ఎపిసోడ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రహించి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారనీ, దీంతో శ్రీనివాస్ కచ్చితంగా తిరుపతి టీడీపీ ఇంచార్జి అవుతారంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారట.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, వంశపారంపర్యంగా రాజకీయ నేపథ్యం ఉన్న మరో సీనియర్ పొలిటీషియన్ మబ్బు దేవనారాయణ రెడ్డి. మొన్నటి వరకు తుడా చైర్మన్ పదవి ఆశించి, అది రాకపోవడంతో ఇంచార్జీ పదవిపై ఆశలు పెంచుకున్నారట. మబ్బు దేవనారాయణరెడ్డి తండ్రి రామిరెడ్డి గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. తిరుపతి ప్రజలలో ఈ కుటుంబానికి బలమైన గుర్తింపు కూడా ఉంది. అదే విధంగా మబ్బు దేవనారాయణరెడ్డికి మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడం,ప్రస్తుతం అయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టిడిపి పార్టీలో ఉండడం కలిసి వచ్చే అంశాలుగా చెపుతున్నారు. ఈ ముగ్గురితోపాటు మరోకరు కోడూరు బాలసుబ్రమణ్యం కూడా ఇంచార్జి రేసులో ఉన్నారు. ఇతని తండ్రి కోడూరు సుబ్బయ్య టిడిపి సీనియర్ పోలటిషియన్. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారట. అదే ఇప్పుడు బాలసుబ్రమణ్యంకు కలిసి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే టిడిపి ఇన్చార్జి రేసులో బలిజ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఉండడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఎవరికి వారే ఇన్చార్జి పదవిపై లెక్కలు వేసుకుంటున్నారట.
ఇక మండల, పట్టణ, నగర కమిటీల ఎన్నిక ఇంకా జరగలేదు. పలుచోట్ల ఏకాభిప్రాయం కుదరడం లేదు. చాలాచోట్ల పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహుల పేర్లు అధిష్ఠానానికి చేరాయి. కొన్ని చోట్ల ఒకే పేరు సిఫారసు చేసారని సమాచారం. కానీ అధికారిక ప్రకటనలు వెలువడడం లేదు. పరిశీలకులు మొదలుకుని ఎమ్మెల్యేల దాకా సంస్థాగత ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవడం లేదని టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లు అవుతున్నా ఇప్పటి దాకా నామినేటెడ్ పదవులు, పార్టీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంపై కార్యకర్తల్లో అసహనం పెరుగుతోందట. తిరుపతి నియోజకవర్గం 50 డివిజన్లలోనూ దాదాపు అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక పూర్తయింది. నగర కమిటీ మాత్రం ఇంకా పెండింగులోనే ఉంది. జిల్లా కేంద్రం కావడంతో ఈ కమిటీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా బలిజ, యాదవ, కమ్మ సామాజికవర్గాల నుంచీ పలువురు ఈ పదవి ఆశిస్తున్నారు. మునిశేఖర్ రాయల్, ఆనంద్ యాదవ్, మన్నెం శ్రీనివాసులు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. Tirupati TDP In-charge.
మరోవైపు నియోజకవర్గ పరిశీలకుడు ఆలపాటి రాజా డివిజన్, క్లస్టర్ స్థాయి నేతలతో సమావేశం జరిపి వారి అభిప్రాయాలను అధిష్ఠానానికి అందజేశారట. కానీ టిడిపి అధిష్టానం మాత్రం ఈ సస్పెన్సుకు ఎప్పుడు తేర వేస్తుందో అని వేయి కళ్ళతో తిరుపతి టిడిపి నాయకులు ఎదురు చూస్తున్నారట. తిరుపతిలో వైయస్సార్సీపీ నాయకులను ధీటుగా ఎదుర్కోవాలంటే టిడిపికి సరైన నాయకుడు అవసరమని కార్యకర్తలు చెబుతున్న మాట. అయితే అందరూ లీడర్లే కావడంతో ఎవరికివారు యమునా తీరే అన్నట్లుగా తిరుపతిలో టిడిపి పరిస్తితి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q