ఆ రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మౌనంగా..?

TDP MLA’s remained silent: ఆ రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలలో కూడా చురుగ్గా పాల్గొనడం లేదని,మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వైసీపీ చేస్తున్న ఎదురుదాడిని సైతం చూస్తూ ఉన్నారే తప్ప ఎదురుమాట్లాడటం లేదని, ఆ రెండు నియోజకవర్గాలలో tdp క్యేడర్ తో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారని జిల్లాలో గుసగుసలు వినపడుతున్నాయి. ఏ జిల్లాలోని ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు, ఎందుకు కేడర్ అంత నిరాశగా ఉందో తెలుసుకోవాలి అంటే…

సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయన ఉత్సాహంగా తిరగడం లేదంటూ గుసగుసలు వినబడుతున్నాయి. మొక్కుబడిగా అమర్నాథరెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారనే నాయకులు లేకపోలేదు. దీనికి అంతటికి అమర్నాథ్ రెడ్డికి టిడిపిలో సమచితస్థానం ఇవ్వకపోవడం, మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కొందరు కీలక నేతలు మౌనంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అందరూ సైలెంట్ గా మారిపోయారు. అందులోనూ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ కీలకమైన నేతలు సైలెంట్ గా ఉండటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తమకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావించిన ఆ నేతలు కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో వారంతా నిరాశాతో ఉన్నారని తెలుసు తమ్ముళ్ల లో తీవ్ర చర్చ జరుగుతుంది.

చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మినహా మరే సందర్బంలో వీరు పెద్దగా కనిపించడం లేదు. అలాగే విపక్షాలు చేసే విమర్శలకు సయితం కౌంటర్లు ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు…అందులోనూ ముఖ్యంగా మాజీ మంత్రి ఎన్. అమర్ నాధ్ రెడ్డి మీడియా ముందు అస్సలు కనిపించడమే మానేశారు అనే టాక్ నడుస్తుంది. ఎన్నికలకు ముందు జోరుగా, హుషారుగా కనిపించిన అమర్ నాధ్ రెడ్డి చివరకు సైలెంట్ గా మారారు. 1996లో పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తరువాత 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైయారు. 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన డీసీసీబీ ఛైర్మన్‌గా, టీడీపీ పార్టీలో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.అమర్ నాధ్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జూన్ 2016లో ycp నుండి టీడీపీలో చేరారు. 2017లో జరిగిన ap మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2 ఏప్రిల్ 2017న పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్‌, కామర్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట గౌడ చేతిలో ఓడిపోయారు. 2024లో ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచి విజయం సాధించారు.

ఎలా చూసినా…?సామాజికవర్గం పరంగా చూసినా, పార్టీలో అమర్ నాధ్ రెడ్డి కి ఉన్న ట్రాక్ రికార్డును చూసిన తర్వాత ఆయనకే కాదు.. టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అని ఎవరైనా అనుకుంటారు. అందులోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మృతి చెందడంతో రెడ్డి సామాజికవర్గం కోటాలోనూ, సీనియారిటీలోనూ తనకే మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం కేబినెట్ లో ఆయనకు చోటు దక్కకపోవడంతో ఒకింత అసంతృప్తికి గురయ్యారు అని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.దేనివల్లనో ఏమో కానీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరో నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. మాజీ మంత్రి దివంగత అమర్నాథ్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్నారు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి. ap మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డికి అన్న అవుతాడు. అన్న కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైకేంద్ర పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు కిషోర్ కుమార్ రెడ్డి. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డి చేతిలో కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. 2017లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి tdp లో చేరారు. cm చంద్రబాబునాయుడు సమక్షంలో కిషోర్ కుమార్ రెడ్డి tdp తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఏపీ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కిషోర్ కుమార్ రెడ్డిని చంద్రబాబు నాయుడు నియమించారు. అలాగే ఏపీ జలవనురుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా కిషోర్ కుమార్ రెడ్డి పని చేశారు. 2019లో కూటమి ప్రభుత్వంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహించి ఘనవిజయం సాధించారు. అన్న కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి ఎంపీగా నిలబడి ఓడిపోయారు.

ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని అందుకోసమే ఆయన పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం లేదని పీలేరు నియోజకవర్గంలో గుసగుసలు వినపడుతున్నాయి. మొదట నుంచి పీలేరు నియోజకవర్గంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఇవన్నీ అన్నకు కలిసి రాకపోయినా తమ్ముడు కలిసి వచ్చిన అంశాలు కానీ టిడిపిలో ఆయనకు సముచిత స్థానం దొరక్క పోవడం మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర నిరాశతో ఉన్నారని, మంత్రివర్గ విస్తరణలో ఏమైనా ఆయనకు ఈసారి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందా అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. TDP MLA’s remained silent.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాలో ఇలా సీనియర్లు తమ నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాలలో మొక్కుబడిగా పాల్గొనడం కార్యకర్తలను గందరగోళానికి దారి తీస్తుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం మూడు నెలలు గడుస్తున్న నామినేటెడ్ పదవులపై ఇంకా అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తుండడంతో కూడా పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ నిష్పృహ నెలకొనిందని సమాచారం. ఇలానే కొనసాగితే మాత్రం ఆ రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ల తోపాటు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలలో కూడా పార్టీ కేడర్ తీవ్ర అసంపూర్తితో ఉందని సమాచారం. ఇకనైనా కేడర్ పై దృష్టి సారించక పొతే, అటు ఎమ్మెల్యేలకు ఇటు కేడర్ కు న్యాయం చేయకపోతే టిడిపి అధిష్టానం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q