మార్కెట్ చైర్మన్ గిరి పై వీడని ఉత్కంట..!

Market Committee Chairman Palamaner constituency: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు గడుస్తుంది. అయినా రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు ఇంకా పూర్తిస్థాయిలో కేటాయించలేదు. నామినేటెడ్ పోస్టుల కోసం ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలలో ఆశావాహులు నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారట. కానీ ఆ నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టులను త్వరగా ఇస్తే బాగుంటుందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారట,ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ల పదవుల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మినహా మిగిలిన 12 నియోజకవర్గాలలో అన్ని టిడిపి జెండా రెపరెపలాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమైన నామినేట్లు పోస్టులను కేటాయిస్తూ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు గడుస్తుంది. ఇంకా చాలా ప్రాంతాలలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోవడంపై సర్వత్ర చర్చ జరుగుతోందట. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఇంకా పదవులు ఇవ్వకపోవడం పై వారంతా నిరాశతో ఉన్నారట. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పక్కనే సరిహద్దు నియోజకవర్గమైన పలమనేరులో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఆ సేవకులు ఎదురుచూస్తున్నారట.

మార్కెట్ కమిటీ చైర్మన్ ల పదవుల పందారం ఆలస్యం అయ్యే కొద్ది ఈ నియోజకవర్గాలలో పదవులు ఎవరిని వరిస్తాయోననే ఎదురు చూస్తున్నారట ఆ నియోజకవర్గ ప్రజలు.రాష్ట్రంలోని 66 మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను ఖరారు చేస్తూ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపుగా మార్కెట్ కమిటీలన్నింటికి చైర్మన్ పదవులను ప్రకటించినప్పటికి నియోజకవర్గంలో మాత్రం కార్యవర్గం ప్రకటించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

పలమనేరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించకపోవడం పై తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు. పలమనేరులో ఇప్పటిదాకా జనసేనకు ఎటువంటి ప్రధాన పదవులు లభించలేదు , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని జనసేన నాయకుల డిమాండ్ వలన ఈ పదవిని ఇంకా ప్రకటించకపోవడానికి కారణమని గుసగుసలు వినబడుతున్నాయి.. దీంతో ఇప్పటిదాకా పదవి తమకే వస్తుందనుకున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైందట. ప్రధానంగా పలమనేరు ఏఎంసి చైర్మన్ గిరి బీసీ మహిళకు కేటాయించేలా రిజర్వేషన్ ఖరారైంది. దీంతో గంగవరం మండలం నుంచి బీసీ కురబ కులానికి చెందిన సోమశేఖర్ గౌడ్, వాల్మీకి కులానికి చెందిన ఆలకుప్పం రాజన్న పేర్లు ప్రధానంగా తెర మీదికి వచ్చాయి… ఇక వీ.కోట మండలం నుంచి సోమశేఖర్, శివకుమారి, చౌడప్ప కూడా ఆశావాహులుగా ఉన్నారు.

అలాగే బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్, సైతం ఈ పదవిని ఆశించిన వారిలో ఉన్నారు. అయితే బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్ కి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ పదవి ఇవ్వడానికి అంగీకరించలేదని సమాచారం, ఇక జనసేన తరఫున బీసీ నాయకులు నాగరాజు, చంద్ర ఇద్దరూ ఆశావాహులు అని సమాచారం…ఇలా ఉండగా కురబ కులానికి చెందిన ఓ నాయకునికి ఇది వరకే కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కట్టబెట్టడం మరియు సోమశేఖర్ గౌడ్ గంగవరం మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతుండడంతో చైర్మన్ గిరి ఆలకుప్పం రాజన్న కు దక్కుతుందని దాదాపు ప్రచారం జరిగింది. ఈ కారణంతో మిగిలిన ఆశావహులు నిరాశకు గురయ్యారట. Market Committee Chairman Palamaner constituency.

ప్రస్తుతం చైర్మన్ పదవిని ప్రకటించకపోవడంపై అందరిలో ఆందోళనతో పాటు ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రభుత్వం ఎవరికి పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ప్రకటిస్తుందో… ఎవరిని పదవి వరిస్తుందో వేచి చూడాల్సిందే.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q