నెల్లూరు నాయకులు ఒకరి ఆస్తులను ఒకరు ధ్వంసం..!

Nellore Leaders Properties War: మాటల యుద్ధం చూశాం కానీ, ఇళ్ల పడి ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటనేది ఇప్పుడు నెల్లూరు జనంలో తీవ్ర చర్చ జరుగుతోందట. నీది తప్పంటే, నీది తప్పు అంటూ ఆరోపణలు చేసే వారిని చూశాం కానీ, వ్యక్తిగత ఆరోపణలతో రోడ్డెక్కడం దారుణమంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారట.

రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా అంటే ప్రత్యేక స్థానం. అందులో మరో కోనసీమగా పిలుచుకునే డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ నుంచి గతంలో ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉన్నత స్థానానికి చేరారు. అలాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో బెజవాడ గోపాల్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఒక దశాబ్దం నుంచి పొలంరెడ్డి, నల్లపురెడ్డి కుటుంబాల మధ్య పోటీ ఉండేది. కానీ గత ఎన్నికల్లో పోలంరెడ్డి దినేష్ రెడ్డికి కేటాయించిన టికెట్ అనూహ్యంగా టిడిపి అధిష్టానం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇవ్వడంతో ఒక్కసారిగా కోవూరు రాజకీయం ఊపందుకుంది. స్వతహాగా సేవాభావం కలిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇమేజికి మహిళ సెంటిమెంట్ యాడ్ అవ్వడంతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు.

అవినీతి రహిత, వివాదరహిత కోవూరు లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేశారు ప్రశాంతిరెడ్డి. అలాగే జనంలో కూడా మమేకం అవుతున్నారు. అయితే గెలిచిన ఎన్నికల తర్వాత కోవూరు రాజకీయం తారాస్థాయికి చేరిందట. రాజకీయాల్లో ప్రతిపక్షం, అధికార పార్టీ విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఇప్పుడు సీన్ వేరేలా మారిందట. విమర్శిస్తే దాడి చేయడమే. దీనిమీద కూడా రెండు పార్టీల కార్యకర్తలు, స్తానిక నేతల మధ్య రగడ కూడా జరుగుతోంది. మహిళను కించపర్చడం ఏంటని ప్రశాంతిరెడ్డి వర్గీయులు చెబుతుంటే, ఇంటి మీద దాడి చేయడం ఏంటని ప్రసన్న కుమార్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. Nellore Leaders Properties War.

సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన ప్రతి సమయంలో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూనే ఉంటారన్నది వాస్తవం. కమిషన్లు, అక్రమ సంపాదన, ఇసుక, గ్రావెల్ దోపిడీతో పాటు కాంట్రాక్టుల్లో పర్సెంటేజీల్లో ప్రసన్న కుమార్ రెడ్డి పీహెచ్డీ చేశారంటూ పదేపదే ఆరోపించేవారు ప్రశాంతిరెడ్డి. దీనిపై వైసీపీ నేతలు తెగ మండిపడుతున్నారు. తమ నేతను వ్యక్తిగతంగా విమర్శించడం వల్లే ఆయన కూడా ప్రశాంతిరెడ్డిని వ్యక్తిగతంగా ఆరోపించారంటూ ప్రసన్న కుమార్ వర్గీయులు ఎదురు దాడికి దిగుతున్నారట. అంతేకాదు, మాటకు మాట సమాధానం చెప్పాలి కానీ, ఇంటిపై దాడులు ఏంటని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు, పదివేల మందితో ప్రశాంతిరెడ్డి ఇంటిపై దాడి చేస్తానన్న ప్రసన్న కుమార్ రెడ్డి మాటలను ఆయన వర్గీయులు సమర్థిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడు ఇంటిపై అల్లరిమూకల విధ్వంసం చేసిన సంఘటన అయితే లేనేలేదు.అలాగే ఒక మహిళను కూడా వ్యక్తిగతంగా దారుణంగా ఈ స్థాయిలో విమర్శించిన దాఖలాలు కూడా ఇంతవరకు జిల్లాలో లేదు. మరోవిషయం ఏంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన సమయంలో మొత్తం వీడియోలో రికార్డ్ అయింది. ప్రతి ఒక్కరూ దాడి చేసిన వారిని గుర్తు పడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా కేసులు నమోదు చేశారట. దీంతో ప్రసన్నకుమార్ వర్గీయులు మండి పడుతున్నారు.అంతేకాదు, వరుసకు ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి అన్నాచెళ్లెల్లు అవుతారట. అఫ్ కోర్స్… కానీ చుట్టరికం చుట్టరికమే, రాజకీయం రాజకీయమే అన్న చందంగా ఇప్పుడు కోవూరు పాలిటిక్స్ నడుస్తున్నాయట.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/the-situation-of-the-students-of-ysr-architecture-and-fine-arts-university-in-kadapa-district-has-become-unbearable/