
ఆయన ఓ మాజీ మంత్రి.. ఆయన నోటికి హద్దే ఉండదు.. ఎవరినైనా సరే ఏక వచనంతో తిట్టడం.. తొడలు కొట్టడం.. మీసాలు తిప్పడం ఆయన నైజం.. నెల్లూరు పెద్దారెడ్డిలను కూడా ఓ ఆటాడుకున్నా నాయకుడు ..ఎవరినీ లెక్కచేయకుండా తనకు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉంటే చాలు మిగతా వాళ్ళతో పనిలేదు అన్న రీతిలో ముందుకు వెళ్తుంటాడు….అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది..కానీ, ఇప్పుడు ఆయనకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పలేదు అధినేత. దీంతో ఆయన నియోజకవర్గ ఇన్చార్జికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడట.. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ? ఏ పార్టీకి చెందిన వ్యక్తి ? అధినేత ఆయన్ని ఎందుకు పక్కన పెట్టారు. లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు. ఆయన నోటికి హద్దు ఉండదు. దురుసుగా మాట్లాడటం అవసరమైతే తొడలు కొట్టడం మరి అవసరం అయితే మీసాలు తిప్పడం ఆయన నైజం అని అందరికీ తెలుసు.. ఆయన పని తీరు నచ్చకే నెల్లూరు జిల్లాలోని పెద్దారెడ్డిలందరూ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో గత ఎన్నికల్లో ఆయనను నెల్లూరు జిల్లాలోనే లేకుండా పక్క జిల్లాకి పంపించరని టాక్ ఉంది. పక్క జిల్లాకు వెళ్లిన తర్వాత అయినా సైలెంట్ గా ఉన్నాడా అంటే అది లేదు. మళ్లీ సొంత జిల్లాలో వేలు పెడుతున్నారట. ఈసారి నెల్లూరు జిల్లాలో ఎంతో సౌమ్యుడిగా..మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో వేలు పెడుతున్నారట అనిల్ కుమార్.
వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డికి ఓ మాట కూడా చెప్పకుండా ఆయన నియోజకవర్గంలోని సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని నానా హంగామా చేస్తున్నారట అనిల్ కుమార్. ఎక్కడైనా ఓ నాయకుడు పక్క నియోజకవర్గంలో వేలు పెట్టాలి అంటే ఆ నియోజక ఇన్చార్జితో సమన్వయం చేసుకొని మాట్లాడి తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. కానీ అనిల్ కుమార్ యాదవ్ స్టైలే వేరు మరి. ఆ నియోజకవర్గంలోని ఇన్చార్జిని కూరలో కరివేపాకు లాగా తీసి పక్కన పారేశారట. అంతే కాదు సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని.. నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే వేలకోట్లు దోచుకుంటున్నారని మీడియా సమావేశాలు పెట్టీ మరీ పదే పదే ఆరోపిస్తున్నారట. అంతటితో ఆగకుండా సైదాపురం మండలానికి వెళ్లి అక్రమ మైనింగ్ జరిగే చోట దీక్ష చేస్తానని నానా హంగామా చేశారట. తీరా చూస్తే తుస్సుమి ఆ ఇష్యూను వదిలేశారట అనిల్ కుమార్. ఇంత వరకు బాగానే ఉంది మరి ఆ తర్వాతే అసలు రచ్చ మైదలైందట.
సైదాపురం మండలం వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గం లోని విషయాలలో వేలు పెడుతున్నారట అనిల్ కుమార్ యాదవ్.. ఇదంతా తెలుసుకొని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తనలో తాను మదనపడుతున్నారట.. ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ముఖ్య నేతలకు తన బాధ చెప్పుకుని ఆవేదన పడ్డారని సమాచారం. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంటే తాను ఎప్పటినుండో పోరాడుతుంటే అనిల్ కుమార్ కి ఏం సంబంధం నా నియోజకవర్గంలో వేలు పెట్టటానికి అని అధినేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారట. ఇలాగైతే నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతలు తాను చూడలేనని తేగేసి చెప్పారని టాక్. అనిల్ కుమార్ యాదవ్ గతంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ కు అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పచెప్పకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ అన్ని నియోజకవర్గాల వైపు తొంగి చూస్తున్నారట.
ఇదిలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం కొంచెం ఎక్కువగా ఉండడంతో అనిల్ కుమార్ యాదవ్ చూపు వెంకటగిరి పై పడింది అని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మొదటి నుండి కూడా వెంకటగిరి నియోజకవర్గం నేదురుమల్లి కుటుంబానికి అడ్డాగా ఉన్న విషయం తెలిసిందే.. అలాంటి నియోజకవర్గం వైపు అనిల్ కుమార్ యాదవ్ కన్నెత్తి చూస్తున్నాడు అని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగానే వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది అనే సాకుతో అక్కడ దీక్ష చేసి యాదవ వర్గ ప్రజలు ఆశీస్సులు పొందాలని అనిల్ కుమార్ యాదవ్ పక్కా స్కెచ్ వేశారట. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ప్లాన్ అర్థం చేసుకున్న రామ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద అధినేత జగన్ వద్ద పంచాయతీ కూడా పెట్టారట. దీంతో అధినేత వెంకటగిరి నియోజకవర్గానికి నీవే సమనవకర్త.. నీవే ఎమ్మెల్యే అభ్యర్థి అని గట్టిగా భరోసా కూడా ఇచ్చారట. వేరే నియోజకవర్గంలో వేలు పెట్టేటప్పుడు ఆ నియోజకవర్గ ఇన్చార్జితో కనీసం మాట్లాడాలి అని వైసీపీ పెద్దలు కూడా అనిల్ కుమార్ యాదవ్ కు క్లాస్ పీకారట.
ఇటు నెల్లూరు సిటీలో పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల్లోకి చాలా స్పీడ్ గా వెళ్లిపోతుండటంతో అధినేత కూడా పర్వత రెడ్డికి సిటీ టికెట్ ఇస్తానని గట్టి భరోసా ఇచ్చారట. దీంతో ఇటు నెల్లూరు సిటీ పోయే..ఇంకో చోట కూడా ఎలాంటి ఇన్చార్జి పదవి లేకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ డిప్రెషన్ లో వెంకటగిరి వైపు చూస్తున్నాడని ప్రచారం జరుగుతుంది . మరి రామ్ కుమార్ రెడ్డి సైలెంట్ గా ఉంటారా… వైసిపి అధినేత జగన్ తోనే ఈ పంచాయతీ చెప్పటంతో రామ్ కుమార్ రెడ్డికి గట్టి భరోసా ఇచ్చారట.మరి మైనింగ్ పై పోరాటం అనే స్క్రిప్ట్ తో వెంకటగిరిలో పాతుకు పోవాలి అనుకున్న అనిల్ కుమార్ యాదవ్ ప్లాన్ కాస్త పటాపంచలు కావడంతో…అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. మరి మున్ముందుఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గ వైపు అనిల్ కుమార్ యాదవ్ చూపు పోతుందో వేచి చూడాలి మరి.