
Larry Ellison: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ఎలాన్‌మస్క్. కానీ ఇక నుంచి ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ భర్తీ చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. టెస్లా, స్పేస్‌ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవ్వడంతో మస్క్‌కు కేటాయించిన షేర్ల విలువ భారీగా తగ్గిపోవడం ఇందుకు ఒక కారణం. కుబేరుల జాబితాలో మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న ఓరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థ విలువ పెరగడం కూడా లారీని ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ముందుంచింది.
తగ్గిన ఎలాన్ మస్క్ షేర్ల విలువ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ తర్వాత స్థానంలో ఉన్న ఒరాకిల్ చీఫ్ లారీ ఎల్లిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా సంస్థ విలువ పెరగడంతో ఆయన మస్క్ ను కిందికి నెట్టేసి టాప్ కు చేరుకున్నారు. ఎలాన్ మస్క్ ప్రస్తుత నెట్ వర్త్ సెప్టెంబరు 2025నాటికి 385 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం ఎలాన్ మస్క్ కు సంబంధించిన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల విలువ 13శాతం తగ్గింది.
ఎలిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొన్న ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్‌లో ఎల్లిసన్‌కు 40 శాతం వాటా ఉంది. ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది. ఒరాకిల్ ఇటీవల బ్లాక్ బస్టర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేయడం కలిసొచ్చింది. దాని ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారం దూసుకుపోతుండడంతో ఈమేరకు ఇన్వెస్టర్లు కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు.
ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం పెరిగింది. ఈ పరిణామంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం లారీ ఎల్లిసన్ సంపద మొత్తం 393 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. అయితే ఇది అప్పటికే ఉన్న ఎలాన్ మస్క్ సంపద 384 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అయినా ఈ ఆధిత్యం తాత్కాలికంగానే నిలిచింది. చివరికి ఒరాకిల్ షేర్లు 328 డాలర్ల వద్ద, 36% వృద్ధిని సాధించి ముగిశాయి. Larry Ellison.
దీని కారణంగా మళ్లీ లారీ ఎల్లిసన్ యొక్క నికర సంపద పడిపోయింది. 378 బిలియన్ డాలర్లుగా నమోదయింది. దీంతో మళ్లీ మస్క్ ముందు వరుసలోకి రాగా తర్వాత స్థానంలోకి లారీ ఎల్లిసన్ చేరారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లను పోల్చితే, ఎలాన్ మస్క్, లారీ ఎల్లిసన్ ఇద్దరూ కుబేరుల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.