బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ వెనుక ఇంత జరిగిందా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనౌన్స్ చేయడం.. ఆతర్వాత ఊహించనంతగా క్రేజ్ రావడం తెలిసిందే. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సైతం రంగంలోకి దింపుతుండడంతో అసలు కథ ఏంటి..? ఎలా ఉండబోతుంది..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్ అవ్వడం అనేది అంత ఈజీగా జరగలేదని.. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉన్నట్టుగా తెలిసింది. ఇంతకీ.. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ వెనుక ఏం జరిగింది..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ వీడియో చూడాల్సిందే..

రాజా రాణి అంటూ లవ్ స్టోరీతో డైరెక్టర్ గా పరిచయమైన అట్లీని కమర్షియల్ డైరెక్టర్ గా మార్చి బ్రేక్ ఇచ్చింది కోలీవుడ్ స్టార్ విజయ్. అట్లీ, విజయ్.. ఈ ఇద్దరి కాంబోలో తేరి, మెర్సల్, బిగిల్ అంటూ మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొటి సక్సెస్ సాధించాయి. అయితే.. ఈ క్రేజీ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించాలి అనుకుందట. రెమ్యూనరేషన్లకే 200 కోట్లు పెట్టాలి అనుకుందట. అయితే.. ఆ టైమ్ లో అట్లీకి షారుఖ్ నుంచి ఆఫర్ రావడంతో జవాన్ స్టోరీ చెప్పడం.. ఓకే అవ్వడం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. ఆ టైమ్ లో విజయ్ గోట్ మూవీ చేశారు. ఆతర్వాత ఇప్పుడు జన నాయగన్ అంటూ ఆఖరి చిత్రం చేస్తున్నారు.

దీంతో సల్మాన్ తో సినిమా చేయాలని స్టోరీ రెడీ చేసి చెబితే.. ఓకే అయ్యింది కానీ.. అంత బడ్జెట్ ఓకే కాదని నో చెప్పారట సన్ పిక్చర్స్. సల్మాన్ తో పాటు మరో స్టార్ హీరోతో కలసి ఈ మూవీ చేయాలి అనుకున్నారు. అయితే.. ఆ కథనే బన్నీకి చెబితే.. ఇద్దరు హీరోలు అయితే చేయనని చెప్పాడట. అప్పుడు వేరే హీరో క్యారెక్టర్ ను కూడా బన్నీతోనే చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందట అట్లీకి. ఇదే విషయం బన్నీకి చెబితే ఓకే చెప్పాడట. ఇంత బడ్జెట్ మూవీ చేయాలంటే.. బన్నీ అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశ్యంతో సన్ పిక్చర్స్ సంస్థ ఓకే చెప్పిందట. ఇప్పటి వరకు సన్ పిక్చర్స్ సంస్థ తమిళ హీరోతో కాకుండా వేరే హీరోతో సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ వేరే లాంగ్వేజ్ హీరోతో ఈ సంస్థ నిర్మిస్తుండడం విశేషం. ఇది ఈ క్రేజీ ప్రాజెక్ట్ జరిగిన అసలు నిజం.ఇదే… మరి.. ఈ సినిమాతో బన్నీ , అట్లీ చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.