
Nithin Srinu Vaitla Movie: సినీ ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా తీస్తే, ఆ హీరోగానీ డైరెక్టర్‌గానీ ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. అదే ఫ్లాపుల పరంపర ప్రారంభమైతే, అవకాశాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ కెరీర్‌నే ప్రశ్నార్థకం చేస్తాయి. అలాంటి సంక్షోభ సమయంలో ఉన్న ఇద్దరు సినీ ప్రముఖులు ఇప్పుడు కలసి ఓ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ ఇద్దరూ గతంలో మంచి పేరు తెచ్చుకున్నా, ఇటీవల వరుస పరాజయాలతో కెరీర్ పరంగా దెబ్బతిన్న వారు.
ఫామ్‌లో లేని నితిన్: గత కొన్ని ఏళ్లుగా నితిన్‌కు విజయాలు దూరమైపోయాయి. భీష్మ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. రాబిన్ హుడ్, తమ్ముడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ పరాజయాల తర్వాత నితిన్ పైనే ప్రాజెక్టులు కూడా తగ్గిపోయాయి. అతను ముందుగా ఒప్పుకున్న ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి కూడా నితిన్ తప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫెయిల్యూర్స్ లో శ్రీను వైట్ల: వెరైటీ కామెడీ, కమర్షియల్ టచ్‌తో ఒకప్పుడు భారీ హిట్లు ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం పూర్తిగా ప్లాపుల్లో ఉన్నాడు. దూకుడు వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయనకు అదే స్థాయి విజయం మళ్లీ దక్కలేదు. మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోని, విశ్వం వంటి సినిమాలు తీవ్ర విఫలమయ్యాయి. దీంతో శ్రీను వైట్లకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. Nithin Srinu Vaitla Movie.
అయితే నితిన్, శ్రీను వైట్ల – కలసి ఓ సినిమాపై పని చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. శ్రీను వైట్ల చెప్పిన కథ నితిన్‌కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వీరిద్దరి కెరీర్‌కు చాలా కీలకం కానుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తిరిగి వెలుగులోకి రావాలంటే, ఈ సినిమా తప్పనిసరిగా హిట్ కావాలి. విజయవంతమైతే ఇద్దరికీ తిరిగి మార్కెట్ పెరగడం ఖాయం.