
Akhanda 2 Release date: నట సింహం నందమూరి బాలయ్య, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టరే అనే టాక్ ఉంది. ఈ క్రేజీ కాంబోలో అఖండ 2 సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. రిలీజ్ విషయంలో తగ్గేదేలే అంటూ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అఖండ 2 రిలీజ్ ప్లాన్ మారిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. అసలు కారణం ఏంటి..? అఖండ 2 న్యూ రిలీజ్ డేట్ ఏంటి..?
అఖండ సినిమాకి సీక్వెల్ అంటే.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా బోయపాటి అఖండ 2 మూవీని తెరకెక్కిస్తున్నారని.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అంటున్నారు మేకర్స్. అయితే.. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం… పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే.. కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
అందుకనే అఖండ 2 రిలీజ్ డేట్ మారిందని సమాచారం. ఇంతకీ.. ఎప్పుడంటే.. ది రాజాసాబ్ రిలీజ్ చేయాలి అనుకున్న డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. డిసెంబర్ 5న రావాలి అనుకున్న రాజాసాబ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. పైగా అఖండ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అఖండ 2 కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయితే.. సెంటిమెంట్ పరంగా కూడా వర్కవుట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారట. ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయమై ఆలోచిస్తున్నారట. అంతా కన్ ఫర్మ్ అయిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. Akhanda 2 Release date.
ఇక అఖండ 2 అప్ డేట్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ని ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి ఈ సాంగ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి.. అఖండ 2 ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/ntr-in-kantara-3-the-news-goes-viral-on-social-media/