
Andhra King Taluka release date: స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న ఉస్తాద్ హీరో రామ్ పోతినేని.. తనలోని మాస్ యాంగిల్ ని పూర్తిగా పక్కనబెట్టేశాడు. ప్రెజెంట్ ఓ క్లాస్ సినిమా చేశాడు. అదే ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ ఇందులో రామ్ కి జోడీగా కనిపించనుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి ఓ మెలోడీ పాట రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇంతకీ ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది ఇప్పటికే చాలావరకు సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో రవితేజ ‘మాస్ జాతర’, తేజ సజ్జా ‘మిరాయ్’, అనుష్క ‘ఘాటీ’, పవన్ కల్యాణ్ ‘ఓజీ’, రిషభ్ శెట్టి ‘కాంతార’ తదితర చిత్రాలు రాబోతున్నాయి. డిసెంబరులో ‘రాజాసాబ్’ లైనులో ఉంది. దీంతో కొత్త సినిమాలొచ్చినా సరే అన్ సీజన్లోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చిత్రం కూడా నవంబర్ 28న షెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
అయితే ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమాకు చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇదొచ్చిన వారానికి ‘రాజాసాబ్’ రిలీజ్ కానుంది. ఒకవేళ ఇది సంక్రాంతికి వాయిదా పడినా, అదే తేదీకి ‘అఖండ 2’ రావొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రెండింటిలో ఏది రిలీజైనా సరే రామ్ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండొచ్చు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రం హీరోలని అభిమానించే ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు. ఇందులో భాగ్య శ్రీ హీరోయిన్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే రామ్-భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. Andhra King Taluka release date.
ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ ఈ మూవీ నుంచి నువ్వుంటే చాలే అనే సాంగ్ ను రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ ను రాసింది రామ్ పోతినేని కావడం విశేషం. ఈ మూవీతో రామ్ లిరిక్ రైటర్ గా కూడా మారిపోయాడు. మొత్తంగా చాలా రోజుల తరువాత రామ్ నుంచి వస్తున్న ఒక క్లాస్ అండ్ లవ్ ఎంటరైనర్ ఆంధ్ర కింగ్ తాలుకా’ మన ఉస్తాద్ హీరోకి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q