
Anil Kapoor in Dragon: సినిమాల్లో ప్రతి పాత్రకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చే దర్శకుల్లో కన్నడ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. ముఖ్యంగా విలన్స్‌తో పాటు, సపోర్టింగ్ రోల్స్ ను సైతం ఆకట్టుకునేలా డిజైన్ చేయడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు అయినా ముద్ర వేసేలా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు అదే మేజిక్‌ను ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘డ్రాగన్’ లో మరోసారి చూపించనున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ దశలో ఉంది. ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే టోవినో థామస్, బిజు మీనన్ వంటి మల్టీ టాలెంటెడ్ నటులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ లిస్టులోకి తాజాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ సైతం భాగం కానున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ను ఎంపిక చేసినట్లు టాక్. రీసెంట్‌గా పాన్ ఇండియా ఫిల్మ్ ‘యానిమల్లో’ హీరో తండ్రిగా మెప్పించిన అనిల్ కపూర్.. ఇప్పుడు తారక్ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్ర కోసం అనిల్ కపూర్‌ను సంప్రదించగా, కథ విన్న వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. అనిల్ కపూర్‌కు ఇది దాదాపు 46 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ కానుంది. అనిల్ కపూర్ 1980లో దర్శకుడు బాపు తీసిన ‘వంశవృక్షం’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. Anil Kapoor in Dragon.
ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన, ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేస్తుండటం విశేషం. ఇటీవల యానిమల్, ఫైటర్, వార్ 2 వంటి హిట్ చిత్రాల్లో అనిల్ కపూర్ చేసిన పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక ‘డ్రాగన్’లో ఆయన పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q