పెద్ది ఫస్ట్ సింగిల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చెర్రీ..!

Peddi AR Rahman Muusic: బుచ్చిబాబు డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా హిట్ అందుకోవాలని చరణ్ ఈ మూవీ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. RRR సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆయన, ఆ క్రేజ్‌ను పెద్దితో కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడు చెర్రీ.

ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకొని ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. పెద్ది థియేటర్లకు రావడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికీ, మూవీ యూనిట్ అప్పుడే వరుస అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ & గ్లింప్స్‌ను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజున మైసూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ గురించి కూడా టీం అప్‌డేట్ షేర్ చేసింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

ఎఆర్ రెహమాన్ మ్యూజికల్ మాస్ట్రో.. పెద్ది సోల్ అండ్ ఎమోషన్ ను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా క్యాప్చర్ చేశారు. మా ఫస్ట్ సింగిల్ త్వరలో వస్తుంది. వేచి ఉండండి” అని చెర్రీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రెహమాన్ ప్రతి భావోద్వేగాన్ని చాలా అందంగా తీసుకొచ్చారని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా స్టూడియోలో రామ్ చరణ్, రెహమాన్ లతో పాటుగా దర్శక నిర్మాతలు కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. Peddi AR Rahman Muusic.

ప్రస్తుతం మైసూర్‌లో జానీ మాస్టర్ నేతృత్వంలో టైటిల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అభిమానుల అంచనాల ప్రకారం, ఇదే పాటను ఫస్ట్ సింగిల్‌గా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇప్పటికే మూడు పాటల ట్యూన్స్ కంప్లీట్ చేశారు. మిగిలిన పాటల కంపోజిషన్ కూడా పూర్తయినట్టు సమాచారం. 2026 మార్చి 27న ‘పెద్ది’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈలోగా పాటలు, పోస్టర్లు, షూటింగ్ అప్‌డేట్స్ ద్వారా ప్రేక్షకుల్లో హైప్ పెంచాలని చిత్రబృందం కసరత్తు చేస్తోంది.