
ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి(Tanikella Bharani) రచించిన ‘హంస వింశతి కావ్యం’ పుస్తకాన్ని అగ్ర కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘సాహిత్యం సమాజానికి అద్దం. భరణి గారు రాసిన హంస వింశతి కావ్యంలోని పద్యం, భావాలు, తత్త్వం కొత్త తరం పాఠకులకు స్ఫూర్తినిస్తాయి. తెలుగు భాష, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే రచన ఇది” అని అభిప్రాయపడ్డారు.
రచయిత తనికెళ్ళ భరణి మాట్లాడుతూ – ‘‘ఈ కావ్యం ద్వారా మన సంస్కృతి, మానవ విలువలు, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పద్యరూపంలో అందించాను. బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రచన ఆవిష్కృతం కావడం నాకు గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. సాహితీ ప్రేమికులు, సినీ ప్రముఖులు, సాంస్కృతిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Tanikella Bharani