
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. నెక్ట్స్ సినిమాల పై భారీ క్రేజ్ ఏర్పడింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేస్తుండడం తెలిసిందే. ఆతర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడనుకుంటే.. ఈ ప్రాజెక్ట్ లేనట్టే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే.. బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది..? బన్నీ ప్లాన్ ఏంటి..? ఏ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ వీడియో చూడాల్సిందే.
అల్లు అర్జున్, త్రివిక్రమ్.. ఇద్దరి మధ్య విభేదాలు రావడం అనేది నిజమని.. అందుకే త్రివిక్రమ్ వెంకీ, చరణ్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. మరి.. బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో అంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది.
స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి యానమిల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ చేయాల్సివుంది. స్పిరిట్ కంప్లీట్ అయ్యేసరికి బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ రామాయణం సినిమాని కంప్లీట్ చేసి రెడీగా ఉంటే.. యానిమల్ పార్క్ ని పట్టాలెక్కిస్తారు. అయితే.. సందీప్ స్పిరిట్ పూర్తి చేసేసరికి అల్లు అర్జున్ అట్లీతో మూవీని కనుక కంప్లీట్ చేసి రెడీగా ఉంటే.. బన్నీతో సందీప్ రెడ్డి సినిమా ముందుగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పచ్చు. ఇప్పుడు బన్నీ.. ఓ వైపు అట్లీ మూవీ వర్క్ చేస్తూనే నెక్ట్స్ ఏంటి అనే దానిని పై సీరియస్ గా థింక్ చేస్తున్నారని తెలిసింది.
అయితే.. సందీప్ రెడ్డి వంగ కాకుండా బన్నీతో సినిమా చేయడం కోసం.. మరో సెన్సేషనల్ డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తోంది. ఎవరా డైరెక్టర్ అంటే.. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 తర్వాత సలార్ మూవీతో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఆతర్వాత సలార్ 2 చేయాలి. అయితే.. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి.. అట్లీతో మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో బన్నీ మూవీ ఉంటుందేమో చూడాలి.