
Devara Part 2 in Suspense: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చినా.. టాక్ తో సంబంధం లేకుండా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే.. ఈ మూవీని రెండు పార్టులుగా తీయనున్నట్టుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. దేవర పార్ట్ 2 ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఆమధ్య దేవర పార్ట్ 2 లేదనే ప్రచారం కూడా జరిగింది. ఆతర్వాత ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చిన అనుమానలు అలాగే ఉన్నాయి. ఇంతకీ.. దేవర పార్ట్ 2 ఏమైంది..? కొరటాల ప్లాన్ ఏంటి..?
దేవర సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదనే ఉద్దేశ్యంతో దేవర 2 చేయాలి అనుకోవడం లేదని ప్రచారం జరిగింది. దీంతో దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై ఎన్టీఆర్ స్పందించారు. దేవర 2 లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం తెలిసింది. దేవర పార్ట్ 1 ను మించి దేవర పార్ట్ 2 ఉంటుందని అభిమానులు, మీడియా సమక్షంలో ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు. దేవర పార్ట్ 2 ఉంటుందని అయితే చెప్పారు కానీ.. ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. Devara Part 2 in Suspense.
అయితే.. ఊహించని విధంగా మైథలాజికల్ మూవీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. అసలు ఈ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలి. అల్లు అర్జున్.. అట్లీతో సినిమా చేస్తుండడంతో ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. త్రివిక్రమ్ అంత వరకు వెయిట్ చేస్తే మరింత గ్యాప్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ కథను ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఈ మైథలాజిక్ స్టోరీకి ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో.. దేవర పార్ట్ 2 ఎప్పుడు అనేది సస్పెన్స్ లో పడింది.
ఎన్టీఆర్ డ్రాగన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ట్స్ ఇయర్ త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇది భారీ ప్రాజెక్ట్.. పైగా మైథలాజికల్ మూవీ. దీంతో ఈ సినిమాకి ఎంతలేదన్నా రెండు సంవత్సరాలు పట్టచ్చు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత దేవర 2 చేయాలి అనుకుంటున్నాడట ఎన్టీఆర్. దీంతో కొరటాలకు బాగా గ్యాప్ వచ్చేస్తుంది. అందుకనే కొరటాల ప్లాన్ మారిందని.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇంతకీ ఎవరితో అంటే.. అక్కినేని హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ లీకైంది. చైతన్యతో సినిమా చేస్తాడా..? లేక అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తాడా..? అనేది బయటకు రాలేదు కానీ.. అక్కినేని కాంపౌండ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/nag-craze-in-japan-manam-movie-re-release/