చైతన్య మరో సినిమాకి ఓకే చెప్పాడా..?

Naga Chaitanya Next Movie: అక్కినేని నాగచైతన్య తండేల్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు. ఇదొక థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమా తర్వాత చైతూ సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. రెండు ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మూడో ప్రాజెక్ట్ కి కూడా ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ మూడు ప్రాజెక్టుల దర్శకులు ఎవరు..? ఈ ముగ్గురులో ముందుగా ఏ డైరెక్టర్ తో చైతన్య సినిమా ఉంటుంది..?

కార్తీక్ దండుతో చేస్తోన్న మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సినిమాని 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. చైతూతో సినిమా చేయడానికి కథలు చెప్పిన డైరెక్టర్స్ ఎవరంటే.. శివ నిర్వాణ ఓ కథ చెప్పడం.. ఆ కథకు చైతూ ఓకే చెప్పడం జరిగిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో లవ్ తో పాటు యాక్షన్ కూడా భారీగానే ఉంటుందని సమాచారం.

అలాగే చైతూతో సినిమా చేయడం కోసం కథ రెడీ చేసిన మరో డైరెక్టర్ మిత్రన్. ఈ కోలీవుడ్ డైరెక్టర్ చైతూ కోసం భారీ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేశాడట. ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. శివ నిర్వాణ, మిత్రన్.. ఈ ఇద్దరూ చైతూ కోసం వెయిటింగ్ లో ఉన్నారని.. ఈ ఇద్దరితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు తెర పైకి వచ్చింది. ఆ డైరెక్టరే.. వంశీ పైడిపల్లి. వారసుడు సినిమా తర్వాత ఇంత వరకు వంశీ పైడిపల్లి కొత్త సినిమాను ప్రకటించలేదు. Naga Chaitanya Next Movie.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా అంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. అమీర్ ఖాన్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓకే అయినా డేట్స్ ఇవ్వడానికి టైమ్ పడుతుందనే ఉద్దేవ్యంతో వంశీ ఆలోచన మార్చుకున్నాడని తెలిసింది. బాలీవుడ్ హీరోతో సినిమా చేయడం కంటే.. ఇప్పుడు తెలుగు హీరోతో సినిమా చేయడం బెస్ట్ అనే ఉద్దేశ్యంతో చైతన్య కోసం కథ రాసి ఇటీవల వినిపించాడట. ఈ కథకు చైతన్య పాజిటివ్ గా స్పందించాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో శివ నిర్వాణ, మిత్రన్, వంశీ పైడిపల్లి.. ఈ ముగ్గురులో ముందుగా ఎవరితో చైతన్య సినిమా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/cinema/bumper-offers-for-a-flop-heroine-will-bhagyashri-borse-will-achieve-success/