కింగ్ డమ్ రిజల్ట్ పై దిల్ రాజు టెన్షన్..?

Vijay Deverakonda’s new movie Kingdom: విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఇది రెగ్యులర్ స్టోరీ కాదు.. విభిన్న కథాంశంతో రూపొందిన కథ. గౌతమ్ చాన్నాళ్లు ఈ కథ పై కసరత్తు చేశాడు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని అందరిలో కలిగించింది. అయితే.. ఈ మూవీకి ఎలాంటి రిజెల్ట్ వస్తుందా అని ఆతృతగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎదురు చూస్తున్నారు. అదేంటి..? ఈ మూవీకి ప్రొడ్యూసర్ నాగవంశీ కదా..? మరి.. దిల్ రాజు వెయిట్ చేయడం దేనికి అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడాల్సిందే..

దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశపరచడం… సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు సినిమా కూడా నిరాశపరిచింది. అయితే.. నెక్ట్స్ నితిన్ తో ఎల్లమ్మ సినిమా చేయాలి. అలాగే విజయ్ దేవరకొండతో రౌడీ జనార్థన్ సినిమా చేయాలి. ఈ రెండు సినిమాల మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కింగ్ డమ్ సినిమా సక్సెస్ అయితే.. రౌడీ జనార్థన్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది. అందుకనే కింగ్ డమ్ మూవీకి ఎలాంటి రిజెల్ట్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ నెల 31న కింగ్ డమ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. Vijay Deverakonda’s new movie Kingdom.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించే సినిమాలను నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ సినిమా సక్సెస్ అయితే.. నైజాంలో మంచి లాభాలు వస్తాయి. ఈ రకంగా కూడా దిల్ రాజు లాభపడే ఛాన్స్ ఉంది. అయితే.. ఇప్పటి వరకు ఉన్న టాక్ ను బట్టి చూస్తుంటే.. కింగ్ డమ్ సినిమా ఈసారి గట్టిగానే సౌండ్ చేసేలా అనిపిస్తుంది. టీజర్ అండ్ ట్రైలర్ సక్సెస్ అవ్వడంతో మరింతగా అంచనాలు పెరిగాయి. జనాలు కూడా ఈసారి విజయ్ దేవరకొండకు మంచి విజయాన్ని అందించాలనే పాజిటివ్ మూడ్ లో ఉన్నారు. ప్రమోషన్స్ గట్టిగా చేశారు. ఈసారి ఖచ్చితంగా కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ టీమ్ అందరిలో ఉంది.

నాగవంశీకి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలుసు. తన ప్రమోషన్స్ తోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాను హిట్ చేసాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ మూవీని నైజాంలో నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమాకి ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ అంతలా కలెక్షన్స్ రావడానికి నాగవంశీ కారణమనే టాక్ ఉంది. షూటింగ్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు అంతా పక్కా ప్లానింగ్ తో చేస్తుంటాడు. అందుకనే వరుసగా సక్సెస్ సాధిస్తున్నాడు నాగవంశీ. ఈసారి విజయ్ కి అర్జున్ రెడ్డి లాంటి ఎమోషనల్ మూవీని అందిస్తున్నాడు. మరి.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/puri-jagannath-and-charme-kaur-meets-prabhas-on-the-sets-of-rajasaab/