
Film Workers vs Film Producers: సినీ కార్మికులు వెర్సెస్ సినీ నిర్మాతలు.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సినీ కార్మికుల వేతనాలు పెంచాలి. అయితే.. మూడు సంవత్సరాలు జూన్ కే కంప్లీట్ అయ్యింది. ఇంత వరకు వేతనాలు పెంచకపోవడంతో సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సినీ నిర్మాతలు కార్మికులు అడుగుతున్నట్టుగా ముప్పై శాతం వేతనాలు పెంచలేమని తేల్చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇంతకీ.. ఈ వివాదం ఎన్నాళ్లు..? ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు…? సమ్మె ప్రభావం ఏ ఏ సినిమాల పై పడింది..?
సినీ నిర్మాతలు ప్రస్తుతం జనాలు థియేటర్స్ కు రావడం లేదని.. నిర్మాతలు కష్టాల్లో ఉన్నారని.. కార్మికులు అడుగుతున్నట్టుగా ఇప్పుడు వేతనాలు పెంచలేమన్నారు. ఆతర్వాత కొన్ని చర్చల అనంతరం 30 శాతం కాదు కానీ.. 15 శాతం పెంచుతామన్నారు.అయినా సినీ కార్మికులు తగ్గేదేలే అన్నట్టుగా షూటింగ్ లకు వెళ్లకుండా కూర్చున్నారు. దీంతో వివాదం మరింత ముదిరింది. పీపుల్ మీడియా అధినేత, సినీ నిర్మాత సినీ కార్మికులకు లీగల్ నోటీసులు ఇవ్వడం.. వాళ్లకు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ లా వలే భారీగానే వేతనాలు ఇస్తున్నామని చెప్పడం వివాదస్పదం అయ్యింది. దీంతో సమస్య మరింత ముదిరింది.
ఇదిలా ఉంటే.. సినీ నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ కందుల దుర్గేష్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. అలాగే సినీ కార్మికుల నాయకులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇలా రోజురోజుకు ముదురుతున్న ఈ వివాదాన్ని సినీ నిర్మాతలు, సినీ కార్మికుల నాయకులు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని చెప్పారని సమాచారం. దీంతో మరోసారి చర్చలు జరపనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది టాక్ వినిపిస్తోంది. Film Workers vs Film Producers.
ఇంతకీ సమ్మె ప్రభావం ఏ ఏ సినిమాల పై పడిందంటే.. చిరు, అనిల్ సినిమా, బాలయ్య అఖండ 2, ప్రభాస్ రాజాసాబ్, రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్, రవితేజ,కిశోర్ తిరుమల సినిమా, సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు, అడివి శేష్ డకాయిట్… ఇలా చాలా చిత్రాల పై ఈ సమ్మె ప్రభావం వందశాతం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక డేట్‌ని లాక్ చేసుకొని ఆ డేట్‌కి రీచ్ కావడానికి చాలా పక్కాగా పని చేస్తున్న సినిమాలు. ఇలాంటి టైమ్ లో సమ్మె కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగకపోతే మళ్లీ డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమౌతుంది. త్వరలోనే సమ్మె విరమిస్తే ఇండస్ట్రీకి మంచిది. మరి.. ఏం జరగనుందో చూడాలి.