రాజాసాబ్ మరోసారి వాయిదా పడనుందా..?

Prabhas Rajasaab Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హర్రర్ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి డైరెక్టర్. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నీ సీరియస్ గా ఉన్న సినిమాలే చేయడంతో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ ఎప్పుడు చేస్తాడా..? ఎప్పుడు వింటేజ్ ప్రభాస్ ని చూస్తామా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. అభిమానుల కోరుకుంటున్నట్టుగానే మారుతి ప్రభాస్ తో రాజాసాబ్ మూవీని తీస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో రావాలి.. రాలేదు. డిసెంబర్ 5న రిలీజ్ అని ప్రకటించారు ఇప్పుడు డిసెంబర్ 5న కూడా రావడం లేదని టాక్. ఇది నిజమేనా..? రాజాసాబ్ మరోసారి పోస్ట్ పోన్ కానుందా..?

ఏప్రిల్ లో రాజాసాబ్ థియేటర్లోకి వస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తే.. నిరాశే ఎదురైంది. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. ఆగష్టులో రిలీజ్ చేయాలా..? దసరాకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలా..? అని ఆలోచించారు కానీ.. సరైన డేట్ కుదరలేదు. ఫైనల్ గా డిసెంబర్ 5న ది రాజాసాబ్ థియేటర్స్ లోకి రావడం ఖాయం అంటూ డేట్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది.

అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న టైమ్ కంటే ఎక్కువ టైమ్ తీసుకుంటుందట. అందుకని సినిమాను అనౌన్స్ చేసినట్టుగా డిసెంబర్ 5న రిలీజ్ చేయలేరని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. మేకర్స్ నుంచి మాత్రం రాజాసాబ్ పోస్ట్ పోన్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో రాజాసాబ్ వాయిదా అనేది నిజమే అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. డిసెంబర్ 5న రాకపోతే రాజాసాబ్ ఎప్పుడు వస్తాడంటే.. సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీని పై క్లారిటీ రావాల్సివుంది. Prabhas Rajasaab Release Date.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఓ వైపు రాజాసాబ్ మూవీలో నటిస్తూనే మరో వైపు ఫౌజీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలను ఈ ఇయర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరడం లేదని… ఈ రెండు సినిమాలు నెక్ట్స్ ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని టాక్. మరి.. ఈ రెండు సినిమాల గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/ghati-movie-director-krish-has-the-release-plan-of-ghati-and-vishwambhara-changed/