డీజే రీ యూనియన్.. మరి జగన్నాథమ్ ఎక్కడ..?

AA Duvvada Jagannadham Reunion: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా విజయం సాధించింది. బన్నీని బ్రాహ్మణ యువకుడుగా హరీష్ శంకర్ కొత్తగా చూపించడం జనాలకు నచ్చింది. బన్నీ కెరీర్ లో అదొక డిఫరెంట్ మూవీగా నిలిచింది. ఇందులో బన్నీకి జంటగా క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. అయితే.. ఇప్పుడు డీజీ గురించి ప్రస్తావన ఎందుకంటే.. ఈ సినిమాలో నటించిన టీమ్ మెంబర్స్ మళ్లీ కలుసుకున్నారు. ఇంతకీ.. ఎవరెవరు కలిసారు..? దువ్వాడ జగన్నాథమ్ ఎక్కడ..? ఇంతకీ.. పూజా ఏమన్నది..?

దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించాడు. వైవిధ్యమైన గెటప్స్ తో కనిపించి సందడి చేశాడు. అయితే.. ఈ సినిమాకి వర్క్ చేసిన కాస్ట్ తాజాగా కలిశారు. దర్శకుడు హరీష్ శంకర్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు సినిమాటోగ్రాఫర్ అయానక బోస్ ఒక చోట కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించి పూజా తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. డీజే రీ-యూనియన్.. అల్లు అర్జున్ నువ్వు ఎక్కడున్నావ్..?’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. దీనికి రిప్లైగా ఐకాన్ స్టార్ నెక్స్ట్ టైమ్ తప్పకుండా కలుద్దాం అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక బన్నీ కొత్త సినిమా విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో బన్నీకి జంటగా నటించే హీరోయిన్ దీపికా పడుకునే అని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు కానీ.. ఇంకా మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ లను ప్రకటించలేదు. వీరిద్దరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనేది ఇన్ సైడ్ న్యూస్. వీరితో పాటు నేషనల్ క్రష్ రష్మిక కూడా ఇందులో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. AA Duvvada Jagannadham Reunion.

ముంబాయిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అట్లీ ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండేలా చాలా క్వాలిటీగా తీసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశాడు. ముందుగా టెస్ట్ షూట్ చేసి.. ఆతర్వాత పర్ పెక్ట్ గా వచ్చింది అనుకుంటేనే రియల్ గా షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. దీని వెనుక అట్లీ పెద్ద కసరత్తే చేస్తున్నాడని తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. ఒక కొత్త తరహా కథను.. ఓ కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని డిజైన్ చేశాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. మరి.. ఈ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/manchu-vishnu-planning-another-big-project-and-the-project-is-related-to-ramayana/