ఘాటీ ఎఫెక్ట్.. అనుష్క సంచలన నిర్ణయం.!

Anushka Ghaati: టాలీవుడ్ స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఇన్ ఘాటీ. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు వేదం లాంటి అండర్ రేటెడ్ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్లో అనుష్క చేసిన మూవీ ఘాటీ . దీంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 5 న ఘాటీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అనుష్క ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి స్వీటీకి నిరాశ తప్పలేదు. ఘాటితో నిర్మాతలకు నష్టాలూ తప్పలేదు. అయితే ఈ సినిమా ప్రభావమో ఏమో తెలీదు గానీ తాజాగా అనుష్క ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

క్రిష్ జాగర్లమూడి దర్వకత్వంలో అనుష్కనటించిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఎన్నో అంచనాల మధ్య విడుదలైమొదటిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే రెండవ రోజు నుంచే కలెక్షన్లు క్షీణించడం ప్రారంభమై, ఒక వారం పూర్తయ్యేసరికి థియేటర్ల నుంచి తీసేసారు. అనుష్క చాలా కాలం తర్వాత తెరపై కనిపించనుండటంతో బయ్యర్లు సినిమాపై మంచి ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు, దర్శకుడు క్రిష్ పై ఉన్న నమ్మకంతో భారీ ధరలకే రైట్స్ కొన్నారు. కానీ సినిమా విడుదలైన తొలి రోజే తీవ్ర నిరాశ ఎదురైంది.

ఇక సినిమా ఫలితం పక్కన పెడితే, అనుష్క తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె తన ఫేస్‌బుక్‌లో – “నీలి వెలుగు దీపకాంతిగా మారేలా… జీవితం నిజమైన అర్ధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రపంచంతో మళ్లీ కలవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నాను. త్వరలోనే కొత్త కథలతో, మరింత ప్రేమతో మీ ముందుకు వస్తాను. చిరునవ్వుతో ఉండండి. ప్రేమతో – మీ అనుష్క శెట్టి” అంటూ షేర్ చేసింది.

ఈ పోస్ట్ చూసిన వెంటనే అభిమానుల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరైతే ‘ఘాటి’ సినిమా ఫెయిల్యూర్ వల్ల మానసికంగా దెబ్బతిని ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ సినిమా ప్రమోషన్లకు అనుష్క హాజరుకాలేదన్న విషయం కూడా గమనార్హం. అప్పట్లో ఆమె బరువు పెరిగినట్టు వార్తలు రావడం, అందుకే ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది.అయితే సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి విరామాన్ని అనుష్క ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సినీ ఫలితాలు ఎలా ఉన్నా, ఆమె మళ్లీ మునుపటిలా ప్రేక్షకుల్ని అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు. Anushka Ghaati.

ఘాటీ తర్వాత అనుష్క నుంచి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోంది. అదికూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి కావడం విశేషం. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిన అనుష్క.. కథానార్ అనే సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. హారర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్​ జయసూర్య లీడ్​ రోల్​​లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రోజిన్ థామస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా మొత్తం 14 భాషల్లో ఒకేసారి రిలీజ్​ కానుంది.