
Vijay Deverakonda’s Kingdom: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. విజయ్ నటించిన లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కింగ్ డమ్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. చాలాసార్లు వాయిదాపడిన కింగ్ డమ్ మూవీ ఈ నెల 31న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా హిందీలో రిలీజ్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ.. కింగ్ డమ్ హిందీ వెర్షెన్ రిలీజ్ వెనుక ఏం జరుగుతోంది..?
కింగ్ డమ్ సినిమా శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమా. ఈ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి చాలా రీసెర్చ్ చేసాడని.. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. అయితే.. ఈ సినిమా హిందీ రిలీజ్ ఉండదని.. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావు.. అందుచేత పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేసినా.. అక్కడ వర్కవుట్ కావడం లేదు. అందుకనే కింగ్ డమ్ సినిమాని హిందీలో థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో నిజమే అనుకున్నారు సినీ జనాలు. Vijay Deverakonda’s Kingdom.
అయితే.. దీని వెనకున్న అసలు నిజాన్ని బయటపెట్టారు నాగవంశీ. ఇంతకీ ఏం చెప్పారటే.. పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెడతారు. అలాగే ఈ సినిమాకి కూడా కింగ్ డమ్ అనే టైటిల్ పెట్టారు. అయితే.. హిందీలో మాత్రం ఈ టైటిల్ వేరే నిర్మాత రిజిస్టర్ చేయించుకున్నారట. అందుచేత హిందీలో వేరే టైటిల్ తో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. ప్రొమోలో హిందీ టైటిల్ చూపించకపోవడంతో అక్కడ రిలీజ్ చేయడం లేదు అంటూ ఊహించుకుని వార్తలు రాసేసారు కానీ.. హిందీలో కూడా వేరే టైటిల్ తో రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ బయటపెట్టారు.
మరి.. హిందీలో ఏ టైటిల్ పెడతారంటే.. సామ్రాజ్యం అనే అర్థం వచ్చేలా టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని.. అవుతుందని నాగవంశీ చాలా గట్టిగా చెబుతున్నాడు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడైపోయాయి. 50 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ చాలా హోం వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేశాడట. అదంతా ఖచ్చితంగా తెర పై కనిపిస్తుందని.. ఈసారి ఖచ్చితంగా విజయ్ సక్సెస్ సాధిస్తాడని చెబుతున్నాడు. మరి.. నాగవంశీ నమ్మకం నిజం అవుతుందా..? విజయ్ కి ఆశించిన విజయాన్ని అందిస్తుందా..? లేదా..? అనేది తెలియాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే.