
Sai Dharam Tej’s Stylish Hero: మెగాస్టార్ మేనల్లుడు.. సాయిదుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తేజ్.. ఇప్పుడు స్టైలీష్ హీరో గురించి ఓ వేడుకలో మాట్లాడడం.. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ఇంతకీ.. తేజ్ దృష్టిలో స్టైలీష్ హీరో ఎవరు..? ఆ హీరో గురించి ఏం మాట్లాడాడు..?
సాయిదుర్గ తేజ్.. యూజెనిక్స్ ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో మోస్ట్ డిజైరబుల్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన తేజ్.. ఈ అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. అయితే.. స్టైలీష్ గా ఉండాలంటే.. చాలా పీస్ ఫుల్ గా జీవిస్తే చాలు. ముఖంలో ఆ అందం ఆటోమెటిక్ గా తెలుస్తుంది అన్నాడు. ఇక తెలుగులో స్టైలీష్ హీరో ఎవరు అని అడిగితే.. రామ్ చరణ్ స్టైలీష్ హీరో అని చెప్పాడు. అలాగే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా తన దృష్టిలో స్టైలీష్ హీరో అని చెప్పాడు. ఈవిధంగా మెగా హీరోలు ఇద్దరూ స్టైలీష్ హీరోలు అంటూ తేజ్ చెప్పడం వైరల్ అయ్యింది.
ఇక తేజ్ సినిమాల విషయానికి వస్తే.. విరూపాక్ష, బ్రో చిత్రాల తర్వాత స్పీడు పెంచుతాడు అనుకుంటే.. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఎక్కువ సినిమాలు చేయాలని ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే కథలతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకనే లేట్ అయినా ఫరవాలేదు.. లేటెస్ట్ గా రావాలి అనుకుంటున్నాడు. కథల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. చాలా కథలు విని ఫైనల్ గా సంబారాల ఏటిగట్టు అనే కథను ఓకే చేయడం.. ఆ సినిమా పట్టాలెక్కడం తెలిసిందే. ఈ సినిమాని హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. Sai Dharam Tej’s Stylish Hero.
ఈ సినిమాని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఏమాత్రం రాజీపడకుండా నిర్మిస్తుండడం విశేషం. ఆమధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. అనూహ్య స్పందన లభించింది. ఇప్పటి వరకు తేజ్ చేయని కథ.. ఇంకా చెప్పాలంటే.. తెర పై రాని కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అఫిషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. సెప్టెంబర్ 25న పవర్ స్టార్ ఓజీ వస్తుండడంతో ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం.
Also Read: https://www.mega9tv.com/cinema/nara-lokeshs-tweet-about-the-movie-coolie-and-ntr-fans-in-shock/