జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు..!

Pawan Kalyan Birthday Special: రంగుల ప్రపంచంలో అయినా…రాజకీయ చదరంగంలో అయినా ఆయన అడుగు పెట్టనంత వరకే..వన్స్ స్టెపిన్ అయితే ఆ పవర్ ని ఆపడం ఎవరితరం కాదని 2024 ఎన్నికలతో 100 పర్సెంట్ ప్రూవ్ చేశారు జనసేనాని. ఒక్కడే ఏం చేస్తాడులే..అని లైట్ తీసుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాక‌నివ్వం అంటూ ఛాలెంజ్ చేశారు..ప్యాకేజీ స్టార్‌ అంటూ అవహేళన పరిచారు ..రెండు చోట్లా ఓడిపోయాడు ఏం గెలుస్తాడులే అంటూ ఎగతాలి చేశారు. మూడు పెళ్లిళ్లు ..ద‌త్త పుత్రుడు అంటూ అవమానించారు. కానీ ఇవేవీ ఆయన్ని వీసమంత కూడా కదిలింలేకపోయాయి. అధికారం ఉంది కదా అని చూపించిన తలపొగరును ప్రజా వవర్ తో అథ:పాతాలానికి తొక్కేశారు. ప్రజల కోసం నేను అంటూ సింగిల్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జనంతోనే ఉంటూ…జనంకోసమే బ్రతుకూతూ ..తానే ఓ ప్రభంజనమై రాజకీయాలలో సరికొత్త చరిత్ర లిఖించారు పవన్ కళ్యాణ్.

మెడ మీద చెయ్యితో అలా అలా రుద్దితే థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆ..ఆ..ఆ అనే డైలాగుకే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు. కథ, కదనంతో పనిలేదు వెండితెరమీద కనిపిస్తే చాలు జన్మ ధన్యమనుకునే కోట్లాది మంది అభిమానులు. ఇక మైకు పట్టుకుని స్టేజ్ మీదకి ఎక్కితే జనం ఊగిపోతారు. అంతా ఆయన కంట్రోల్ లోకి వెళ్లిపోతారు. దేశాధినేతలే ఆయన ఛరిష్మాకు ఫిదా అయిపోయారంటే ఆయన ఆరా ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఆయన తలచుకుంటే వంద‌ల కోట్లు సంపాదించగల స్టామినా ఉన్నా ఎన్నో మాట‌లు పడ్డారు…చిటికేస్తే చాలు స‌క‌ల సౌక‌ర్యాలూ కాళ్ల మీద వ‌చ్చి ప‌డ‌తాయి.. కానీ రోడ్డు మీద ఎండనక, వాననక తిరిగారు. తాను సంపాధించింది స్వార్థంతో దాచుకోలేదు..ఆస్తులు , అంతస్తులు కూడ బెట్ట‌లేదు..ఎవరినీ దోచుకోలేదు…ఎవరు అడ్డు చెప్పినా..ప్రజలే ముఖ్యమనుకున్నారు..ప్ర‌తీ పైసా జనానికే ఖ‌ర్చు పెట్టారు..పెడుతున్నారు. మట్టి కుండలో బువ్వ..అవ్వల ముద్దు బిడ్డ..ఆడపడుచులకు అన్నయ్య ..నమ్మిన తమ్ముళ్లకు కొండంత అండగా నిలిచారు..ఇదంతా ఎందుకు అని ఆయన్ని ప్రశ్నిస్తే ఆ కోరమీసం కిందున్న పెదాలపై వచ్చే చిరునవ్వే సమాధానం చెబుతుంది.

సినిమాల్లో పవన్ హీరోయిజం రచయితలు రాసింది..కానీ నిజ జీవితంలోని ఆయన వ్యక్తిత్వం, నిజాయితీ ఆ హీరోయిజం కంటే గొప్పది..ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ తనకు తానుగా స్వయంగా రాసుకుంది. ఆయన సినిమా ఎప్పుడైనా పట్టాలు తప్పిందేమో కానీ ఆయన వన్స్ మాటిస్తే నిలబడతారు…దాని కోసం ఎక్కడికైనా వెళ్తారు. అడ్డు ఎవరు వచ్చినా అదరడాలు..బెదరడాలు అస్సలు ఉండవు..పవన్ కళ్యాణ్ లాంటోళ్లు లిమిటెడ్ ఎడిషన్ లో ఉంటారు. వెరీ రేర్ పీస్. ఆ వ్యక్తిత్వమే ఆయన్ని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం రేంజ్ లో కూర్చోబెటటింది. భవిష్యత్తులో ఆ పవర్ మరింత పెరుగుతుందేమో ఎవరికి తెలుసు.. అందుకే ఆ పవర్ ను వాడుకోవాలనే కానీ…ఆడుకోకుడదు..అలా అనుకుంటే అణు విధ్వంసాలే సంభవిస్తాయి.

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు..కానీ 21 ఏళ్ల నుంచే ఆయనలో రాజకీయ ఆలోచనలు పురుడుపోసుకున్నాయి. ఆయనలో కమ్యూనిజం భావాలు మొదలయ్యాయి. జనం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. జనసేనను స్థాపించారు. పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పేరు రాజకీయాల్లో వినిపించినపుడు ఎన్నో పార్టీల లిస్టులోకి మరోటి చేరిందంటూ గిట్టని వాళ్లు గేలి చేశారు. అందుకే ఆరంభంలోనే ఎన్నికల కోసం ఆరాటపడకుండా ఆచితూచి అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు టీడీపీ తోక పార్టీ అని గేలిచేశారు. పవన్ కళ్యాణ్ స్పీచులు విని సినిమా డైలాగులు అంటూ హేళన చేశారు. అయినా అవేమీ పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే బరిలో నిలిచారు. అప్పుడు మూడు పెళ్లిళ్లు అంటూ తన వ్యక్తిత్వంపై దాడి చేశారు. ప్రజల్లో ఆయనకు వస్తున్న సపోర్టును చూసి ఓర్వేలేకపోయారు. ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందడంతో ప్రత్యర్ధులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. రాజకీయాలు చేతకావంటూ అవమానించారు. వాటన్నింటిని ఒపిగ్గా భరించారు. అలా అక్కడ తగ్గారు పవన్ కళ్యాణ్. తన ఓటమికి ఎవరినీ నిందించలేదు. తనను తాను ప్రశ్నించుకున్నారు. జన క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రజల్లోకి వచ్చి గెలుపు కోసం వేట మొదలు పెట్టారు.

ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలియాలి. అది పవన్ కి బాగా తెలుసు. 2019 ఎన్నికల్లో ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకున్నారు. తన ఓటమిని చూసి నవ్వుతారని ఆయనకి ముందే తెలుసు. అయినా ఆయన కుంగిపోలేదు. అవమానాలు పడేవాడు.. గుండె నిండా ఆశలు నింపుకున్నవాడు ముందుకు వెళ్లలేడని.. గుండెల్లో ఆశయాలు ఉన్నవాడే జీవితంలో ముందుకు వెళ్తారని భావించారు. ఓటమి తర్వాత జనసైనికులను మళ్లీ సరైన దారిలో పెట్టేందుకు ఓ యజ్ఙం చేశారు. దైవబలంతో ముందుకు కదిలారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చు కాని… రావడం మాత్రం పక్కా..అంటూ ఐదేళ్ల పాటు ప్రజల మధ్యన ఉంటూ..వారి పక్షాన పోరాటాలు చేస్తూ..ఆ నాటి అధికార వైసీపీ నేతల విమర్శలను భరిస్తూ.. అప్పుడప్పుడూ కొంచెం గట్టిగా సమాధానం చెబుతూ..తనని తాను తగ్గించుకుని ప్రజల ముందు సేవకుడిలా నిలుచుని తన పని తాను చేసుకుంటూ పోయారు.

చూస్తుండగానే 2024 ఎన్నికల నగారా మోగింది. ఈసారి యుద్ధంలో గెలవాలనుకున్నారు. యుద్ధ తంత్రాన్ని మార్చారు. శత్రువుని ఓడించడమే తన ముందున్న లక్ష్యమనుకున్నారు. అందుకోసం తనవారికి దూరమయ్యారు. ఈసారి అటు బీజేపీ..ఇటు తెలుగుదేశం పార్టీలతో కూటమి కట్టారు. పొత్తులో భాగంగా 23 స్థానాల్లో పోటీకి రంగంలోకి దిగారు. అధికార పార్టీ నేతల తిట్ల దండకాన్నే తన విజయానికి రచమార్గంగా మార్చుకున్నారు. అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం అంటూ సవాల్ చేసిన వైసీపీకి పిఠాపురం ప్రజలు అసెంబ్లీ గేటు తాకడం కాదు…దాన్ని తన్నుకుంటూ వెళ్లేలా భారీ మెజారిటీతో జనసేవకుడిని గెలిపించుకున్నారు. పిఠాపురం ఆయన తాలూకాగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఆ పదవిని అధికారం అనుకోలేదు. కొత్తగా అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన విద్యార్థిలా తన కర్తవ్యాలను తెలుసుకున్నారు.

మాట నిలబెట్టుకోవడం అంటే పవన్ ని చూసే నేర్చుకోవాలి. ఒక్కసారి మాట ఇస్తే మడమ తిప్పడాలుండవ్. ఇక సాయం కావాలని ఎవరు తలుపుతట్టినా వారిని నిరుత్సాహపరచలేదు. తనకు సాయం చేసిన వారిని ఎప్పుడు విస్మరించలేదు. ప్రతిభ ఉన్న యువతశక్తిని ప్రోత్సహించడం..తన విజయం కోసం ప్రార్థించిన చేతులను చేరదీయడం పవన్ వ్యక్తిత్వంలో భాగం. రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రజల ముందు మాత్రం ఇప్పటికీ ఒదిగే ఉన్నారు. కర్ణుడిని తలపించే దాన గుణం, ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఆయన్ని అందరివాడిని చేశాయి. Pawan Kalyan Birthday Special.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత , డిప్యూటీ సీఎం మాత్రమే కాదు. ఆయన క్రేజ్ తెలుగు నేలను దాటి దేశమంతటా విస్తరిస్తోంది. హిందుత్వాన్ని బాగా హైలైట్ చేస్తున్న జనసేనాని.. ప్రధాని మోదీకి బాగా దగ్గరయ్యారు. సనాతన ధర్మ రక్షణే తన ధ్యేయమంటూ వారాహి డిక్లరేషన్ రూపొందించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పాన్ ఇండియా పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా హిందూ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. ఎప్పుడూ కాషాయ వస్త్రాల్లో ఉండే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా అప్పుడప్పుడూ దీక్ష తీసుకునే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న హిందూ ఐడెంటిటీ ఎన్నో రెట్లు అధికం. తెలుగు సినీ రంగంలో ఆయన సంపాదించుకున్న క్రేజ్ కంటే వేల రెట్లు అధిక క్రేజ్ ఆయనకు సనాతన ధర్మ పోరాటం తెచ్చిపెట్టింది. ట్విట్టర్ , ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఇలా ఒకటేమిటి ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఓ ట్రెండింగ్ సబ్జెక్టే. పవన్ కళ్యాణ్ ఓ వ్యక్తి కాదని ఆయన ఒక తుఫాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆయన్ని కొనియాడారు అంటే ఆయన చరిష్మా ఏపాటితో అర్థంచేసుకోవచ్చు. ఇంతలా పవన్ సాధించిన ఈ ప్రజాభిమానం ఒక్కరోజులో వచ్చింది కాదు. దీని కోసం ఓ యోగిలా తపస్సు చేశారు.. అవమానాలను దిగమింగుకుని ఆత్మస్థైర్యం పెంచుకున్నారు.. ప్రజల కోసం గెలాలని సంకల్పించుకున్నారు..దైవాన్ని నమ్ముకుని సనాతన ధర్మంవైపు అడుగులు వేశారు. ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోవు. ఆయన అంతరార్థం ఎవరికీ అర్థం కాదు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q