అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Akhanda 2 New Release Date: నట సింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ మరింతగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో బాలయ్య, పవన్ సినిమాలు పోటీపడడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇప్పుడు బాలయ్య అఖండ 2 రిలీజ్ డేట్ మారబోతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటి..? అఖండ 2 న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు..?

ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి కలిసి సింహా, లెజెండ్, అఖండ సినిమాలు చేయడం.. ఆ మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి బ్లాక్ బస్టర్ సాధించడం తెలిసిందే. దీంతో వీరిద్దరూ కలసి చేస్తోన్న నాలుగవ సినిమా అఖండ 2 అంతకు మించి అనేలా సక్సెస్ సాధిస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఈసారి బోయపాటి పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేయడం విశేషం. అవును.. ఈసారి బాలయ్య, బోయపాటి కలిసి అఖండ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా ఫాస్ట్ గా జరుగుతోంది. Akhanda 2 New Release Date.

అయితే.. ఈ మూవీలో గ్రాఫిక్స్ కి ఎక్కువ స్కోప్ ఉందట. ఈ కారణంగా ఈ సినిమా కంప్లీట్ కావడానికి కాస్త ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే సెప్టెంబర్ 25న అఖండ 2 రావడం లేదని.. పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. డిసెంబర్ 18 అని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారట. అయితే.. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ కాకుండా డిసెంబర్ 18న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలంటే.. చాలా కసరత్తు చేయాలి. మిగిలిన భాషల్లో ఏ సినిమాలు పోటీగా వస్తున్నాయో చూసుకోవాలి.. అలాగే ఆ భాషల్లో డబ్బింగ్ చేయించాలి.. ప్రమోషన్స్ భారీగా చేయాలి.. ఇలా చాలా పెద్ద పనే ఉంటుంది. అందుకని అన్నీ చూసుకుని పక్కాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి డిసెంబర్ 18 పర్ ఫెక్ట్ డేట్ అని మేకర్స్ ఫిక్స్ అయ్యారని సమాచారం. అఖండ 2 న్యూ రిలీజ్ డేట్ అనేది బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయ్యింది. త్వరలోనే అఖండ 2 న్యూ రిలీజ్ డేట్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్. మరి.. ప్రచారంలో ఉన్న ఈ న్యూస్ పై అఖండ 2 మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/the-title-of-chiranjeevi-and-anil-ravipudis-new-movie-checkout-the-information/