
Allu Arvind GHMC Notice: హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ (GHMC) కఠినంగా వ్యవహరిస్తోంది. సామాన్యులైనా, ప్రముఖులైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఈసారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై జీహెచ్ఎంసీ కన్నేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో ‘అల్లు బిజినెస్ పార్క్’ పేరిట అల్లు అరవింద్ కుటుంబం ఒక వాణిజ్య భవనాన్ని నిర్మించింది.
సుమారు 1000 గజాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టగా, జీహెచ్ఎంసీ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు నాలుగు అంతస్థుల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఈ భవనం నిర్మాణాన్ని 2023 నవంబరులో, అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ భవనంలో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
అయితే ఈ భవనంపై అనుమతులు లేకుండానే అదనంగా ఒక పెంట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ విషయాన్ని గమనించిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు, పెంట్‌హౌస్‌కి అవసరమైన ముందస్తు అనుమతులు తీసుకోకపోవడాన్ని గమనించి దాన్ని అక్రమ నిర్మాణంగా గుర్తించారు. వెంటనే అల్లు అరవింద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, “ఈ నిర్మాణాన్ని ఎందుకు తొలగించకూడదో” తెలియజేయాలని కోరారు. Allu Arvind GHMC Notice.
జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు ఇచ్చిన ఈ నోటీసుల్లో, తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం పెంట్‌హౌస్‌ను కూల్చివేసే చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ స్పందనపై పరిశ్రమలో ఆసక్తికర చర్చ మొదలైంది. నిబంధనలు అతిక్రమించినట్టుగా తేలితే, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ నోటీసుల అంశంపై అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q