
KGF Actor Dinsh : సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ‘KGF’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దినేష్(63) ఇక లేరు. ‘కేజీఎఫ్’లో శెట్టి అనే పాత్రలో ఆకట్టుకున్న ఆయన ఇటీవల తుదిశ్వాస విడిచారు. గత వారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐదు రోజులపాటు చికిత్స పొందిన ఆయనను అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం ఉదయం 3:30 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందారు.
నటుడి మృతి విషయం ప్రకటించిన కుటుంబ సభ్యులు.. ఆయన భౌతికదేహాన్ని బెంగళూరులోని నివాసంలో సందర్శకుల కోసం ఉంచనున్నట్లు తెలిపారు. దినేష్ హఠాన్మరణం కన్నడ ఇండస్ట్రీలో విషాదం నింపింది. పలువురు నటీనటులు ఈయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దినేష్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.KGF Actor Dinsh.
ఇక దినేష్ విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందపురకు చెందిన దినేష్ అసలు పేరు మంగళూరు దినేష్. సినీ రంగంలో స్థిరపడాలనే లక్ష్యంతో బెంగళూరుకు వచ్చారు. మొదట ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలతో నటుడిగా పేరుమొచ్చారు. ఎన్నో కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ, ‘కేజీఎఫ్’లో శెట్టి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దినేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.