
Vishal Engagement : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నేడు ఈ హీరో బర్త్ డే. అయితే పుట్టిన రోజే తన ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫోటోలు చూస్తుంటే ఎంగేజ్మెంట్ వేడుక కేవలం ఈ చాలా సింపుల్ అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగినినట్లు తెలుస్తోంది.
తమిళం స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. అదే ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సాయి ధన్సిక ను పెళ్లాడబోతున్నాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. తామిద్దరం ఆగస్టు 29నలో పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్.. ఆ సంఘ(నడిగర్) భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో చెప్పిన తేదీన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా సింపుల్‌గా ఈ వేడుక జరిగింది.
తన ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని విశాల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు.’ నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ.. నాకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజునే నా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో సాయి ధన్సికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఈ జంటను చూసిన అభిమానులు.. వీళ్ళ పెయిర్ చాలా చూడ ముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. Vishal Engagement.
ఇక సాయి ధన్సిక విషయానికొస్తే . ఈమె తమిళనాడు తంజావూరుకి చెందిన అమ్మాయి. 2006లో ‘మనతోడు మజైకాలం’ అనే తమిళ సినిమాతో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్‌తో ప్రేక్షకులకు పరిచయమైంది. 2009లో ‘కెంప’ మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. ‘కబాలి’ చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.
‘షికారు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ చేసింది. విశాల్-ధన్సిక ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ విశాల్‌తో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందని ధన్సిక చెప్పింది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని, కొన్నాళ్ల క్రితమే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది.