
NTR Koratala Siva: టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు కొట్టిన దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ చూసాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. దేవర తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ, ఆ సక్సెస్ తారక్ స్టార్ పవర్ తోనే సాధ్యమైందనే కామెంట్స్ వచ్చాయి. అయినప్పటికీ ‘దేవర 2’తో కొరటాల అంటే ఏంటో చూపిస్తాడని అభిమానులు భావించారు. ఇలాంటి తరుణంలో ఈ డైరెక్టర్ ఒక్కసారిగా బాంబ్ పేల్చాడు. సడెన్ గా ‘దేవర 2’ ను కొరటాల పక్కన పెట్టేసి వేరే హీరోతో సినిమాకి రెడీ అయ్యాడట. ఇంతకీ కొరటాల దేవర 2 ను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది. కొరటాల లేటెస్ట్ మూవీ ఏ హీరోతో ఉండబోతుంది?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పార్ట్-2 పక్కా ఉంటుందని ‘దేవర 1’ మూవీ జపాన్ ప్రమోషన్స్ లో తారక్ స్వయంగా చెప్పారు. యంగ్ టైగర్ ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సీక్వెల్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కొరటాల కూడా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, అక్కినేని నాగ చైతన్యతో కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కొరటాల శివ ఇటీవల నాగ చైతన్యకు ఓ స్క్రిప్ట్ నేరేట్ చేశారని, దానికి హీరో సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇదే చైతూ 25వ సినిమా అవుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే అక్కినేని హీరో కెరీర్ లో మైలురాయి సినిమాగా మంచి ప్రాజెక్ట్ సెట్ అయినట్లేనని అనుకోవాలి. కాకపోతే ‘దేవర 2’ సంగతేంటి అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత నెల్సన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో వర్క్ చేయబోతున్నారు. NTR Koratala Siva.
‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ గా రూపొందుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ కూడా తారక్ లైన్ లో పెట్టారనే టాక్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన వెంటనే ‘దేవర 2’ని పట్టాలెక్కించాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ లైనప్ మారే అవకాశం ఉంది. అందుకే ఈ గ్యాప్ లో నాగచైతన్యతో కొరటాల శివ సినిమా చేస్తారని చెప్పుకుంటున్నారు. మరోవైపు తారక్, కొరటాల కలిసి దేవర పార్ట్ 2ను పక్కన పెట్టేయాలనే నిర్ణయానికి వచ్చారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా తారక్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q