లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..!

Meenakshi Chaudhary bollywood Debut: ఇటీవల కాలంలో టాలీవుడ్‌కి చెందిన యంగ్ హీరోయిన్లు మంచి హిట్లు రాగానే బాలీవుడ్ వైపు మళ్లుతున్నారు. కానీ వారిలో చాలా మంది హిందీలో సక్సెస్ కాకపోవడం, దాంతో పాటు తెలుగులోనూ అవకాశాలు తగ్గిపోవడంతో కెరీర్ పూర్తిగా డౌన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. పూజా హెగ్డే ఈ మధ్యకాలం లో దీనికి ఓ ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు అదే దారిలో శ్రీలీల కూడా బాలీవుడ్‌ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది. ప్రస్తుతం ఆమె హిందీలో కొన్ని సినిమాలు చేస్తోంది, అయితే అవి షూటింగ్ దశలోనే ఉన్నాయి.

శ్రీలీల తర్వాత ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొని యువతలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మీనాక్షి చౌదరి కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆమె హిందీలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్స్ లో నటించినా, 2025లో మాత్రం మీనాక్షికి కొత్తగా ఏ ఒక్క తెలుగు ప్రాజెక్ట్‌ కూడా రాలేదు. దాంతో ఆమె స్పీడ్ తగ్గిందని, అవకాశాలు తగ్గిపోతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా గురించి కూడా ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ఇక ఇదే పరిస్థితి కొనసాగితే మీనాక్షి టాలీవుడ్ నుంచి ఔట్ డేట్ అవుతుందేమో అన్న అనుమానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ నేపథ్యంలో మీనాక్షికి ఊహించని ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినా బాలీవుడ్‌లో మాత్రం ఆమెకు తలుపులు తెరచుకున్నాయి.
జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతోన్న బాలీవుడ్‌ హిట్ ఫ్రాంచైజీ ‘ఫోర్స్’ మూడో భాగానికి రంగం సిద్ధమవుతుండగా, ఇందులో హీరోయిన్‌గా మీనాక్షిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో డిస్కషన్లు పూర్తి చేసి, కథ నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. Meenakshi Chaudhary bollywood Debut.

ఇప్పటి వరకు మీనాక్షి పూర్తిగా టాలీవుడ్‌ లోనే కెరీర్ కొనసాగించింది. బాలీవుడ్‌కి దూరంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గిన నేపథ్యంలో, ఆమె బాలీవుడ్‌ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే.. మీనాక్షి బాలీవుడ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకునే అవకాశాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.