
Megastar Cameo in Paradise: టాలీవుడ్లో తనదైన క్లాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు పూర్తిగా మాస్ అవతారానికే అడుగులు వేస్తున్నాడు. లవ్, ఫ్యామిలీ, యూత్‌ఫుల్ సినిమాలతో “పక్కింటి కుర్రాడు”గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన నాని, ‘దసరా’ సినిమాతో తన ఇమేజ్ను పూర్తిగా మార్చేశాడు. ఈ చిత్రం ద్వారా మాస్ ఆడియన్స్తోను కనెక్ట్ అయ్యి, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అందుకు తగ్గట్టుగానే ‘హిట్ 3’లో ఓ క్రూరమైన పోలీస్ పాత్రతో వెండితెరపై రక్తపాతం సృష్టించాడు. చిన్నపిల్లలు, రక్తం చూసి భయపడేవాళ్లు ఈ సినిమా దూరంగా ఉండాలని ఆయన స్వయంగా చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా నాని ఈ సినిమాతో మంచి లాభాలు గడించాడు. ఇప్పుడు మళ్లీ ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలసి ‘ది ప్యారడైజ్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.
నాని పాత్రలో మాస్ యాంగిల్‌తోపాటు భావోద్వేగాలు కూడా కనిపించనున్నట్లు టాక్. ఇక చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. దీంతో షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్లమ్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. Megastar Cameo in Paradise.
ఇందులో ఓ పవర్ఫుల్ క్యామియో కోసం మేకర్స్ భారీ ప్లాన్ వేశారట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తదుపరి సినిమాను చిరంజీవితో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ కాంబినేషన్‌కు ముందు చూపుగా ‘ది ప్యారడైజ్’లో చిరంజీవి గెస్ట్ రోల్ చేయనున్నారట. ఇదే గనక నిజమైతే, చిరంజీవి – నాని కాంబో స్క్రీన్ మీద సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు.