వేరే లెవెల్ లో మెగాస్టార్ విశ్వంభర..!

Megastar’s socio-fantasy movie Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ మీడియాకి ఇంటర్ వ్యూలు ఇస్తూ.. సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే విశ్వంభర సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. ఈ మూవీకి సంబంధించి వశిష్ట్ చెప్పిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందులో ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారు అనే వార్త లీకైంది. అయితే.. ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరు అనేది మాత్రం అంతగా బయటకు రాలేదు. ఇప్పుడు ఈ హీరోయిన్స్ విషయమై క్లారిటీ ఇచ్చారు వశిష్ట్. ఇంతకీ.. ఏం చెప్పారంటే.. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నార‌ని వశిష్ట కన్ఫ‌ర్మ్ చేశారు. అందులో భాగంగానే త్రిష లీడ్ హీరోయిన్ గా న‌టిస్తుంటే, ఆషికా రంగ‌నాథ‌న్ సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తున్నార‌ని తెలియచేశారు. మిగిలిన ముగ్గురు కథానాయికలు క‌థ‌లో భాగంగా క‌నిపిస్తార‌ని.. మొత్తంగా ఐదుగురు హీరోయిన్స్ చాలా కొత్తగా కనిపిస్తారని.. వాళ్ల పాత్రలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తెలియచేశారు.

ఇదిలా ఉంటే.. విశ్వంభర సినిమాకి అవతార్ సినిమాకి పోలీక ఉంటుందని.. ఆ సినిమా ఇన్ స్పిరేషన్ తో తీస్తున్నారని ఓ ప్రచారం అయితే జరుగుతుంది. దీని పై కైడా వశిష్ట్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో విజువ‌ల్స్ ఆ కామెంట్స్ కు కార‌ణ‌మై ఉంటాయి కానీ.. విశ్వంభ‌ర క‌థ‌, ఆ సినిమా కోసం తాను సృష్టించిన ప్ర‌పంచం మొత్తం వేరే లెవల్లో ఉంటుందన్నాడు. అలాగే విశ్వంభ‌ర విడుదల ఆల‌స్యం అవ్వడానికి కార‌ణం విజువ‌ల్స్ ఎఫెక్ట్స్ వ‌ర్కే అని చెప్పారు. దాదాపు వర్క్ కంప్లీట్ అయ్యిందని.. త్వరలోనే విశ్వంభర విడుదల తేదీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తామని వశిష్ట్ చెప్పారు. Megastar’s socio-fantasy movie Vishwambhara.

జనరల్ గా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడినప్పుడు డైరెక్టర్స్ రంగంలోకి దిగి ఇంటర్ వ్యూలు ఇస్తుంటారు.. సినిమాని ప్రమోట్ చేస్తుంటారు. అయితే.. వశిష్ట్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే.. విశ్వంభర విడుదల ఎప్పుడు అనేది ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ అయినా ఇంకా చాలా టైమ్ ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయడం విశేషం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ అండ్ కొత్త టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విశ్వంభర చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. మరి.. చిరంజీవి, వశిష్ట్ కలిసి విశ్వంభర మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/sundeep-kishan-doing-power-peta-which-nithin-is-supposed-to-do-krishna-chaitanya-who-has-prepared-the-story-of-power-peta/