విలన్ గా మోహన్ బాబు..!

Mohan Babu As Villain: సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోలుగా చేసిన వారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా తమలోని మరో యాంగిల్ ను చూపిస్తున్నారు. శివాజీ, జగపతిబాబు లాంటి వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ రోల్స్ లో దూసుకుపోతున్నారు. వీరి బాటలోనే ఇప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కూడా చేరబోతున్నార. చాలాకాలం తర్వాత ‘కన్నప్ప’ ద్వారా వెండితెరపై కనిపించిన ఆయన ఇప్పుడు ఓ డెబ్యూ హీరో సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హీరో అవ్వకముందు మోహన్‌బాబు విలన్ పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలకి ఆయన విలన్‌గా నటించారు. ఆ తర్వాత రూటు మార్చి హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కలెక్షన్ కింగ్‌ గా పేరు తెచ్చుకున్నారు. ఇక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న మోహన్‌బాబు ఇటీవలే తన కొడుకు మంచు లీడ్ రోల్ ప్లే చేసిన ‘కన్నప్ప’లో నటించి మెప్పించారు. సీనియర్ హీరోలంతా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి రాణిస్తున్న తరుణంలో మోహన్‌బాబు కూడా మంచి కథలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ మనవడి సినిమా కథ నచ్చి విలన్ రోల్ కి ఓకే చెప్పారట.

సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్‌బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమారెత రాషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ నటుణ్ణి తీసుకోవాలని అజయ్ భూపతి అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే అజయ్ భూపతి.. మోహన్‌బాబుని సంప్రదించారట. స్టోరీ వినగానే ఇంప్రెస్ అయిన కలెక్షన్ కింగ్ విలన్ రోల్ చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. Mohan Babu As Villain.

రీసెంట్ గా కన్నప్పలో మెరిసిన మోహన్ బాబు.. తన కుమార్తె మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘దక్ష’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. నాలుగేళ్ల క్రితం ఈ చిత్రాన్ని ‘అగ్ని నక్షత్రం’ పేరుతో ప్రకటించగా కొన్ని అవాంతరాలతో ఆగిపోయింది. తాజాగా ‘దక్ష’గా పేరు మార్చుకుని ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q