
Nag Craze in Japan: అక్కినేని ఫ్యామిలీకే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మరచిపోలేని సినిమా మనం. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మనం సినిమా ఎంతటి సంచలనం సృష్టించందో తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆమధ్య రీ రిలీజ్ చేసారు కదా.. మళ్లీ ఈ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా..? దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. మరి.. ఆ ప్రత్యేక కారణం ఏంటి..? ఈ సినిమా రీ రిలీజ్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే..
అక్కినేని హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య.. ఇలా మూడు తరాలకు చెందిన హీరోలు ఒకే సినిమాలో నటించడం విశేషం. ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించే సినిమా కావడంతో అక్కినేని అభిమానులే కాదు.. సినీ అభిమానులు అందరూ ఈ సినిమాని చూసి ఆనందించారు. ఈ మూవీలో మరో ప్రత్యేకమైన విషయం అక్కినేని అఖిల్ క్లైమాక్స్ లో రావడం. ఈ సినిమాతోనే అది కూడా అక్కినేని నాగేశ్వరరావు సమక్షంలోనే అఖిల్ ఎంట్రీని ప్లాన్ చేయడం నిజంగా అక్కినేని అభిమాలకే కాదు సినిమాను ప్రేమించే అందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది. Nag Craze in Japan.
ఇక అసలు విషయానికి వస్తే.. జపాన్ సినీ అభిమానులు తెలుగు సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటి అనేది ప్రపంచానికి తెలియచేసింది దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో అయితే.. ఆస్కార్ అవార్డ్ సైతం దక్కించుకుని చరిత్ర సృష్టించింది తెలుగు సినిమా. దీంతో జపాన్ లో తెలుగు సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మన స్టార్ హీరోలను ఎంతగానో ఆదరిస్తున్నారు. తెలుగు నేర్చుకుని మరీ.. తమ అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు.
కింగ్ నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను చూసిన జపాన్ సినీ అభిమానులు నాగార్జునను ఎంతో ప్రేమతో నాగ్ సామా అంటూ పిలుచుకుంటున్నారు. జపాన్ లో సామా అంటే.. రాజులను, దేవుడును అలా పిలుస్తారు. అంతటి ప్రేమను నాగార్జున పై చూపిస్తుండడం విశేషం. ఇటీవల రిలీజైన కుబేర సినిమాను కూడా నాగార్జున కోసం మళ్లీ మళ్లీ చూస్తున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. నాగ్ పై ఇంత ప్రేమ చూపిస్తుండడంతో నాగ్ సినిమా మనం అక్కడ రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా ప్రీమియర్స్‌కు నాగ్ కూడా జపాన్ వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కుదరకపోతే.. ఇక్కడ నుంచి అక్కడ అభిమానులను ఆన్ లైన్ లో మాట్లాడాలి అనుకుంటున్నారట. మొత్తానికి నాగ్ ఈ వయసులో కూడా జపాన్ లో క్రేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి.. మనం సినిమా అక్కడ ఎంత వరకు ఆకట్టుకుంటుందో.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/power-star-said-okay-to-another-movie-under-people-media-factory/